Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వెనుకబడిన వర్గాల (BC) మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సచివాలయంలో అధికారికంగా ప్రారంభించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మహిళల ఆర్థిక పరిపుష్టి, స్వయం సమృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టుమిషన్లను అందించి, వారిని చిన్నపాటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
Read Also : Hyderabad Metro Passes: హైదరాబాద్ మెట్రో పాసులు బంద్
Minister Ponnam launches free sewing machine scheme.
Telangana Free Sewing Machine Scheme: 1.19 లక్షల మిషన్ల పంపిణీ.. దరఖాస్తు గడువు వివరాలు
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టుమిషన్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కుట్టుమిషన్ విలువ సుమారు రూ. 12,000 ఉంటుందని వెల్లడించారు.
- దరఖాస్తు ప్రారంభ తేది: ఆగస్టు 15
- చివరి తేది: సెప్టెంబర్ 15
అర్హత కలిగిన బీసీ మహిళలు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు నిర్ణీత వ్యవధిలో ఆన్‌లైన్ లేదా నిర్దేశిత మార్గాల ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

