Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీశైల దేవస్థానం టికెట్ బుకింగ్ సర్వర్ డౌన్

శ్రీశైల దేవస్థానం టికెట్ బుకింగ్ సర్వర్ డౌన్

వార్త 1 week ago

Srisailam tickets issue:శ్రీశైల దేవస్థానం ఆన్‌లైన్ వెబ్‌సైట్ మరియు మనమిత్ర యాప్‌లో టికెట్ల బుకింగ్‌కు సంబంధించి భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

శ్రీశైల దేవస్థానం ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా శ్రావణ మాస దర్శనాలు అలాగే పూజల కోసం ముందుగా టికెట్లు రిజర్వ్ చేసుకోవాలనుకునే యాత్రికులు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు. వెబ్‌సైట్ సరిగ్గా పని చేయకపోవడంతో భక్తులు తమ ప్రయాణ ఏర్పాట్లను ముందస్తుగా ప్లాన్ చేసుకోవడంలో అడ్డంకులు కలుగుతున్నాయి.

AP building rules: ఏపీలో మారిన భవన నిర్మాణ నిబంధనలు

 Srisailam Devasthanam Online Ticket Booking

వెబ్‌సైట్ నిర్వహణ సంస్థ మార్పు

దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న 9 అండ్ 9 సంస్థపై అధికారులు ఆంక్షలు విధించడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని తెలుస్తోంది. గత 2021 సంవత్సరం నుంచి ఇదే సంస్థ వెబ్‌సైట్ రూపకల్పన బాధ్యతలతో పాటు ఆన్‌లైన్ టికెట్ల జారీ సేవలను విజయవంతంగా అందిస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం నిర్వహణ బాధ్యతల మార్పు వ్యవహారం కారణంగా సర్వర్ లోపాలు తలెత్తడంతో పాటు భక్తులకు బుకింగ్ ప్రక్రియ నిలిచిపోయింది.

Srisailam tickets issue:టీఎంఎస్ సంస్థకు బాధ్యతలు

ప్రస్తుతం కొత్తగా టీఎంఎస్ సంస్థ ద్వారా భక్తులకు ఆన్‌లైన్ టికెట్లు జారీ చేయడానికి దేవదాయ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే గతంలో ఇదే టీఎంఎస్ సంస్థ నిర్వహణలో ఉన్న సమయంలో టికెట్ల విక్రయాలు అలాగే రిజర్వేషన్లలో కొన్ని అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత మార్పులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.

Epaper: epaper.vaartha.com

శ్రీశైలానికి పరుగులు తీస్తున్న కృష్ణమ్మ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha