Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్

వార్త 2 months ago

Srisailam: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్. (ఫోటో రైట్ అప్)1-చిత్రపటం ను బహూకరిస్తున్న ఈవో)2-ఆలయంలో చైర్మన్ సభ్యులు)అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మల్లన్న ను గురువారం నాడు ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జోహార్ శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

ముందుగా ఆలయ రాజగోపురం వద్ద ఈవో ఎం. శ్రీనివాసరావు అర్చక స్వాములు సాదర స్వాగతం పలికారు. తదుపరి శ్రీ స్వామి వారికి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాకార మండపంలో చైర్మన్ మరియు సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు వల్లించగా, అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేశారు.అనంతరం ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి వార్ల శేష వస్త్రములతో సత్కరించి లడ్డు ప్రసాదాలను అందజేశారు.తదుపరి శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటంను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ వెంకటేశ్వరరావు, ప్రజా సంబంధాల అధికారి టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read Also: Kedarnath: వైభవంగా కేదార్‌నాథ్ ఆలయ పునఃప్రారంభం.. రంగురంగుల పుష్పాలతో ముస్తాబైన పుణ్యక్షేత్రం!

 Srisailam: AP SC Commission Chairman visits Srisailam Mallanna

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గోదా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha