Jurala Release Flood Water to Srisailam Reservoir : ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై ఆందోళన చెందుతున్న రైతుల్లో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కొత్త ఆశలు నింపుతున్నాయి.
కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలా మారడంతో అక్కడ నుంచి కృష్ణా జలాలను భారీగా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టు వైపు కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. వరద ఉద్ధృతి పెరగడంతో జూరాల జలాశయం కళకళలాడుతోంది. కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి గత మూడు రోజులుగా నీటిని విడుదల చేస్తుండటంతో జూరాల వద్ద ఇన్‌ఫ్లో గురువారం ఉదయానికి 80,000 క్యూసెక్కులుగా నమోదైంది.
Read Also: Jagan Uttarandhra Tour: జగన్ ఉత్తరాంధ్ర పర్యటనకు భారీ జనసంద్రం
Jurala Release Flood Water to Srisailam Reservoir
- జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం: 9.66 టీఎంసీలు
- జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా 47,000 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపుతున్నారు.
- అధికారులు 10 గేట్లు ఎత్తి శ్రీశైలానికి నీటిని విడుదల చేస్తున్నారు.
Jurala Release Flood Water to Srisailam Reservoir : శ్రీశైలం జలాశయం నీటి మట్ట వివరాలు
కృష్ణా నది ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో శ్రీశైలం జలాశయానికి ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 79,403 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది.
- నీటి మట్టం: గురువారం ఉదయం 6 గంటల సమయానికి 824.80 అడుగులు
- నీటి నిల్వ:44.6090 టీఎంసీలు
- ప్రస్తుతం శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని ఇంకా ప్రారంభించలేదు.
Epaper: epaper.vaartha.com
పరీక్షల లీకేజీల నిరోధక బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. కేంద్ర నిర్ణయంపై లోకేశ్ హర్షం

