Srisailam Dam:శ్రీశైలం డ్యాంకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ ప్రధానం. ఆసియా ఖండంలోని అతిపెద్ద దిగా గుర్తించబడిన శ్రీశైలం ఆధునిక దేవాలయమైన డ్యాంకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారు ప్రత్యేక గుర్తింపును గావించి ధ్రువీకరణ పత్రాన్ని ప్రధానం చేశారు.ఈ సందర్భంగా సోమవారం నాడు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి ఏపీ జెన్కో అతిథి గృహంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ జాయింట్ సెక్రెటరీ ఇలియాజర్ గుర్తింపు పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జల వనరుల శాఖ,ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ జాయింట్ సెక్రెటరీ మాట్లాడుతూ శ్రీశైలం డ్యామ్ కు నాలుగు విధములైన ప్రత్యేకతలను గుర్తించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నందు శ్రీశైలం డ్యాం పేరును నమోదు చేయడం జరిగిందని తెలిపారు. శ్రీశైలం జలాశయం కు అమర్చిన ఒక్కొక్క గేటు 55/60 సైజు కలిగిన అతిపెద్ద గేట్స్ డ్యామ్ అని, ఉన్నటువంటి పారామీటర్స్ లో 25.4 లక్షల వాటర్ సామర్థ్యం కలిగిందని, 2009వ సంవత్సరంలో అత్యధిక క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరినప్పటికీ తట్టుకొని నిలబడగలిగిందని, చెక్కుచెదరని కట్టడం గా గుర్తించడం జరిగిందని చెప్పారు.అదేవిధంగా 980 సముద్ర మట్టం నుంచి 980 అడుగుల ఎత్తు కలిగిన డ్యామ్ గా ఉందని, ఇండియాలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రికల్ విద్యుత్ పవర్ ప్లాంట్ ఉన్నటువంటిదని చెప్పారు.
Srisailam Project Shines on the Global Stage
Srisailam Dam:ఇంజనీర్ల ప్రతిభకు అద్దం పడుతున్న నిర్మాణం
ఈ నాలుగు పారామీటర్స్ ను గుర్తించి పరిగణములోకి తీసుకొని తర్వాత శ్రీశైలం డ్యాం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ లో లిఖించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగం కలగలిసిన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం, అదేవిధంగా శ్రీశైలం జలాశయం అనేది ఆధునిక దేవాలయంగా నెలకొని ఉన్నదని చెప్పారు.వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారు రికార్డులో ఎక్కించడం జరిగిందని వ్యాఖ్యానించారు. శ్రీశైలం జలాశయంకు ఇంత పెద్ద గుర్తింపు ఇచ్చినందుకు గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారికి ఏపీ ప్రభుత్వం తరఫున, జల వనరుల శాఖ,జెన్కో, ట్రాన్స్కో ఆయా శాఖల అధికారులు అందరి తరపున వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలపడం జరుగుతుందని చెప్పారు. జలాశయ నిర్మాణం అనేది అప్పటి ఇంజనీర్ల గొప్పతనంకు నిలువెత్తు నిదర్శనమని 2009వ సంవత్సరంలో అతిపెద్ద వరదలు వచ్చిన ప్పటికి తట్టుకునే విధంగా ఇంజనీర్లు క్వాలిటీతో నిర్మించడం జరిగిందని తెలిపారు. అనేక విశిష్టలతో,ప్రత్యేకత ఉండే విధంగా శ్రీశైల జలాశయం రూపుదిద్దు కుందని అన్నారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద డ్యామ్ గా శ్రీశైలం డ్యాం గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం జలాశయం ఎస్సీ వేణుగోపాల్ రెడ్డి, ఏపీ జెన్కో, ట్రాన్స్కో అధికారులు, శ్రీశైలం తెదేపా ఇన్చార్జి యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Epaper: epaper.vaartha.com

