Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీశైలం ఘాట్ రోడ్డులో స్తంభించిన రవాణా.. ఇబ్బందుల్లో భక్తులు

శ్రీశైలం ఘాట్ రోడ్డులో స్తంభించిన రవాణా.. ఇబ్బందుల్లో భక్తులు

వార్త 1 month ago

Srisailam Traffic Jam: వరుస సెలవుల నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దైవదర్శనం కోసం వేలాదిమంది భక్తులు సొంత వాహనాల్లో తరలిరావడంతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Read Also : Pawan Kalyan Independence Day Speech: 'వికసిత్ భారత్'లో ఏపీ పాత్ర కీలకం.. పవన్ కల్యాణ్

 Traffic stalled on Srisailam Ghat Road; devotees face hardship.

భక్తుల వాహనాల రద్దీ తీవ్రమవ్వడంతో సాక్షిగణపతి ఆలయం నుంచి హఠకేశ్వరం వరకు, అలాగే శ్రీశైలం ప్రధాన ముఖద్వారం నుంచి సున్నిపెంట వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనితో ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Srisailam Traffic Jam: శ్రీశైల మల్లికార్జునుని దర్శనానికి 2 గంటల సమయం

ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్వామివారి దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. శ్రీశైలం దేవస్థానం అధికారులు, స్థానిక పోలీసులు ఘాట్ రోడ్డు మరియు సున్నిపెంట పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు తీవ్రంగా యత్నిస్తున్నప్పటికీ, భక్తుల రద్దీ నిరంతరం పెరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య కొనసాగుతూనే ఉంది

జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల 'ఎన్టీఆర్ మీల్' సేవలకు ముగింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha