చలివేంద్రాన్ని ప్రారంభించిన కార్యనిర్వహణాధికారి
Srisailam temple: అష్టాదశ శక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగం క్షేత్రమైన శ్రీశైలంలో భక్తుల సౌకార్యార్ధం దేవస్థానం పలుచోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేసింది.
దేవస్థానo వైద్యశాల ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం నాడు కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు ప్రారంభించారు.
Cold buttermilk and fresh water for devotees at Srisailam
Srisailam temple:భక్తులకు మజ్జిగ, చల్లని మంచినీరు పంపిణీ
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ వేసవి తీవ్రత కారణంగా దేవస్థానం ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ చలివేంద్రాలలో చల్లని మంచినీటితో పాటు, మజ్జిగ కూడా భక్తులకు అందజేయడం జరుగుతోందన్నారు. అదేవిధంగా కరివేన సత్రం, ఆర్టీసి బస్టాండు, సిద్ధరామప్ప వాణిజ్య సముదాయం, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలైన చోట్ల కూడా ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.
శివసేవకుల స్వచ్ఛంద సేవలు
ఈ చలివేంద్రాలలో శివసేవకుల స్వచ్ఛంద సేవలను వినియోగించుకోడం జరుగుతోందన్నారు. దేవస్థానం సూచనల మేరకు పలు సత్రాల వారు కూడా ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులందరికీ కూడా ఈ చలివేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమములో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. నరసింహారెడ్డి, శివ సేవకుల విభాగపు పర్యవేక్షకులు టి.హిమబిందు, అన్నప్రసాద వితరణ విభాగపు పర్యవేక్షకులు పి.దేవిక తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
తిరుపతి వెళ్లే వారికి శుభవార్త.. మే 9 నుంచి కొత్త సర్వీసు షురూ!

