Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీశైలంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

శ్రీశైలంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

వార్త 3 weeks ago

Srisailam VIP Break Darshan: శ్రీశైలం, మే 29: శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను మే 29 నుంచి జూన్ 1వ తేదీ వరకు నాలుగు రోజులపాటు రద్దు చేసినట్లు శ్రీశైల దేవస్థానం ఈవో ఎం.

శ్రీనివాసరావు తెలిపారు. ఈ నాలుగు రోజులపాటు భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.

వేసవి సెలవులు, వారాంతపు సెలవుల కారణంగా శ్రీశైలానికి భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో పేర్కొన్నారు.భక్తులు ఈ మార్పును గమనించి దేవస్థానానికి సహకరించాలని కోరారు.

భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ క్యూకాంప్లెక్సుల్లో ఉదయం వేళలో భక్తులకు వేడి పాలను అందజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు కూడా నిరంతరం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లలో కూడా భక్తులకు తాగునీటి సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు.

 VIP break darshans in Srisailam cancelled.. Key announcement for devotees

క్షేత్ర పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో మంచినీటితో పాటు మజ్జిగను కూడా అందజేస్తున్నట్లు ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. భక్తుల సౌకర్యమే దేవస్థానం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

శ్రీశైలంలో భ్రమరాంబ దేవి అమ్మవారికి బంగారు హారం సమర్పణ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha