Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీవారి గరుడ సేవ.. తిరుమల ఘాట్ రోడ్‌లో బైక్‌లకు నో ఎంట్రీ

శ్రీవారి గరుడ సేవ.. తిరుమల ఘాట్ రోడ్‌లో బైక్‌లకు నో ఎంట్రీ

వార్త 1 week ago

Tirumala Garuda Seva: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేంకటేశ్వరస్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడవాహన సేవ శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు అత్యంత వైభవంగా జరుగనుంది.

ఈ పవిత్ర గరుడసేవకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో టీటీడీ, పోలీసు శాఖలు సంయుక్తంగా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ పాలకమండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.

Read Also : TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక సామాన్యులకే ప్రాధాన్యం!

 Srivari Garuda Seva: No entry for bikes on Tirumala Ghat Road

Tirumala Garuda Seva: ఘాట్ రోడ్లపై ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం

గరుడసేవకు విచ్చేసే భక్తుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా భావించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం (అక్టోబర్ 15) రాత్రి 9:00 గంటల నుంచి శనివారం (అక్టోబర్ 17) ఉదయం 6:00 గంటల వరకు తిరుమలకు వెళ్లే రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల (Two-Wheelers) రాకపోకలను పూర్తిగా నిషేధించారు. భక్తులు ఈ నిబంధనను గమనించి టీటీడీకి సహకరించాలని ఛైర్మన్ కోరారు.

భక్తులకు పార్కింగ్ సూచనలు

తిరుమలలో పరిమిత పార్కింగ్ వసతి మాత్రమే ఉన్నందున.. ద్విచక్ర వాహనాలు మరియు ఇతర ప్రైవేట్ వాహనాల్లో వచ్చే భక్తులు తిరుపతిలోని నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాలలోనే తమ వాహనాలను నిలిపివేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. తిరుపతి నుంచి టీటీడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో భక్తులు సురక్షితంగా తిరుమలకు చేరుకోవాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం పోలీసు, రవాణా శాఖల సూచనలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు.

పిల్లలు, వృద్ధుల భద్రత కోసం ప్రత్యేక ‘ట్యాగ్స్’

బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో విపరీతమైన రద్దీ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు రద్దీలో తప్పిపోకుండా ఉండేందుకు మహిళా పోలీసు సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా చిన్నపిల్లలు,వృద్ధుల చేతులకు ప్రత్యేక గుర్తింపు ట్యాగ్‌లను కడుతున్నారు. ఒకవేళ ఎవరైనా కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోతే, ఈ ట్యాగ్‌ల సహాయంతో వారిని సులువుగా గుర్తించి, సురక్షితంగా వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు వీలుంటుంది. ఏదేమైనప్పటికీ, భక్తులు కూడా తమ పిల్లలు, వృద్ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, రద్దీ ప్రాంతాల్లో వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలిపెట్టకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇంద్రకీలాద్రిపై లలితా త్రిపుర సుందరి అలంకారంలో దుర్గమ్మ దర్శనం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha