Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీవారి రూ.300 టికెట్లకు షెడ్యూల్.. రేపే విడుదల..!

శ్రీవారి రూ.300 టికెట్లకు షెడ్యూల్.. రేపే విడుదల..!

వార్త 3 weeks ago

Special Entry Darshan : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan) టికెట్లను ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.

అలాగే తిరుమల, తిరుపతిలోని వసతి గదుల ఆన్‌లైన్ కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ షెడ్యూల్‌ను టీటీడీ అధికారికంగా ప్రకటించింది.

నవంబర్ నెల దర్శన కోటా :

నవంబర్ నెల దర్శన కోటా విడుదలలో భాగంగా ఇప్పటికే పలు సేవలు, దర్శనాలకు సంబంధించిన టికెట్లను టీటీడీ దశలవారీగా విడుదల చేసింది. ఆగస్టు 24న అంగప్రదక్షిణ టోకెన్లు ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తుల కోసం ప్రత్యేక దర్శన టోకెన్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసింది.

ఇక ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోసం భక్తులు ప్రయత్నించాల్సి ఉంటుంది. టికెట్ల విడుదల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు ఒకేసారి బుకింగ్‌కు ప్రయత్నించే అవకాశం ఉండటంతో ముందుగానే టీటీడీ ఆన్‌లైన్ పోర్టల్‌లో లాగిన్ వివరాలు, భక్తుల సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.

అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటా విడుదల కానుంది. దర్శనం టికెట్లతో పాటు వసతి కూడా కావాలనుకునే భక్తులు ఈ సమయాన్ని తప్పక గమనించాలి. భక్తులు దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌లను అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే చేసుకోవాలని టీటీడీ సూచించింది.

ఆంధ్ర పాప్ కార్న్ దేశానికి పరిచయం చేస్తాం : చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha