Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీవారికి భారీ విరాళం: కోటి రూపాయలు మొక్కుగా చెల్లించిన హైదరాబాద్ వ్యాపారవేత్త

శ్రీవారికి భారీ విరాళం: కోటి రూపాయలు మొక్కుగా చెల్లించిన హైదరాబాద్ వ్యాపారవేత్త

వార్త 2 months ago

TTD Updates: కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, వర్మ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వర్మ స్వామివారిపై తన భక్తిని చాటుకున్నారు.

టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ. 1,01,01,116 విరాళంగా అందించారు. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి ఈ భారీ మొత్తానికి సంబంధించిన డీడీని ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు దాతను ప్రత్యేకంగా అభినందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Varma Steels MD donating 1 crore to TTD

TTD Updates: విరాళం ఇచ్చే దాతలకు టీటీడీ కల్పించే ప్రత్యేక దర్శన వసతులు

తిరుమల శ్రీవారి ట్రస్టులకు రూ. కోటి అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ జీవితకాలం పాటు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది. దాతతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులకు ఏడాదిలో మూడు రోజుల పాటు సుప్రభాత సేవ, బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏటా నాలుగు రోజుల పాటు సుపథం మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. వసతి సౌకర్యం కింద మూడు రోజుల పాటు రూ. 3000 విలువైన గదులను ఉచితంగా కేటాయిస్తారు. వీరికి ఏటా 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలతో పాటు బంగారు మరియు వెండి డాలర్లను బహుమతిగా టీటీడీ అందజేస్తుంది.

తిరుమలలో వైభవంగా ప్రారంభమైన భాష్యకారుల ఉత్సవాలు

మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో 19 రోజుల పాటు సాగే భాష్యకారుల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. విశిష్టాద్వైత సిద్ధాంతకర్త శ్రీ భగవద్ రామానుజాచార్యుల జన్మ నక్షత్రమైన ఆరుద్రను పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా రామానుజుల వారి విగ్రహాన్ని బంగారు తిరుచ్చిపై ఉంచి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్, చిన్న జీయర్ స్వాములతో పాటు ఆలయ అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏప్రిల్ 22వ తేదీన ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన భాష్యకార్ల సాత్తుమొర కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

'నేను ప్రెసిడెంట్ కాకుంటే, లియో XIV పోప్ అయ్యేవారే కాదు': ట్రంప్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha