Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షూటింగ్‌లో బాలకృష్ణకు గాయం.. స్పందించిన జూనియర్ ఎన్టీఆర్!

షూటింగ్‌లో బాలకృష్ణకు గాయం.. స్పందించిన జూనియర్ ఎన్టీఆర్!

వార్త 2 weeks ago

Balakrishna Injury: కాకినాడ పోర్ట్ పరిసరాల్లో జరుగుతున్న తన 111వ చిత్రం (NBK111) షూటింగ్ సమయంలో ప్రముఖ నటుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రమాదవశాత్తూ గాయపడ్డారు.

షూటింగ్‌లోని ఒక కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ అకస్మాత్తుగా కాలు జారి కింద పడిపోవడంతో ఆయన మోకాలికి స్వల్ప గాయమైంది. కాకినాడ పోర్టు పరిసరాల్లో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు మరియు కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్ర బృందం షెడ్యూల్ నిర్వహించింది. మంగళవారం చిత్రీకరణ జరుగుతున్న సమయంలో బాలకృష్ణ కాలు జారడంతో మోకాలికి గాయమైంది.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన చిత్రయూనిట్ సభ్యులు ఆయనను హుటాహుటిన కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి, మోకాలికి ఎక్స్-రే అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. నందమూరి బాలకృష్ణకు జరిగిన ఈ ప్రమాదంపై ఆయన అల్లుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన బాబాయ్ బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు.

Read Also : Yash Toxic Movie: యశ్ 'టాక్సిక్' చిత్రం నుంచి రెండో పాట 'మనసు ఆగదే' విడుదల!

 Balakrishna injured during shoot… Jr. NTR responds!

Balakrishna Injury: ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

“గెట్ వెల్ సూన్ బాలా బాబాయ్. మీరు త్వరగా కోలుకోవాలని, తిరిగి ఫుల్ ఫాంలోకి రావాలని కోరుకుంటున్నాను” అని జూనియర్ ఎన్టీఆర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటు బాలయ్య అభిమానులతో పాటు నందమూరి అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకుని తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టాలని కామెంట్స్ రూపంలో కోరుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha