Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిద్దరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం

సిద్దరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం

వార్త 2 weeks ago

Siddaramaiah Resign : కర్ణాటక రాజకీయాల్లో ఒక కీలక అధ్యాయం ముగిసింది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య సమర్పించిన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ అధికారికంగా ఆమోదించారు.

దీంతో కన్నడ నాట కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. సిద్ధరామయ్య దిగిపోవడంతో తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే సస్పెన్స్‌కు కూడా కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. జూన్ 1 లేదా జూన్ 3వ తేదీన డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ అధికార మార్పిడితో బెంగళూరులోని రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

Read Also : డ్యాన్స్ ఆఫ్ డెత్.. న్యాయవ్యవస్థకే చెంపదెబ్బ!

అత్యధిక కాలం సీఎంగా సరికొత్త రికార్డు.. హిస్టరీ క్రియేట్ చేసిన సిద్ధరామయ్య!

సిద్ధరామయ్య రాజీనామాతో కర్ణాటక రాజకీయ చరిత్రలో ఒక అరుదైన రికార్డు నమోదైంది. ఆయన తన రాజకీయ ప్రస్థానంలో రెండు విడతలుగా (2013-18 మరియు 2023-26) కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మొత్తం మీద 8 సంవత్సరాల 11 రోజుల పాటు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని, కర్ణాటక చరిత్రలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా సిద్ధరామయ్య సరికొత్త రికార్డు సృష్టించారు. ఎన్నో సవాళ్లను, రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొని సుదీర్ఘకాలం పాలన సాగించిన ఆయన, ఇప్పుడు తన సహచర నాయకుడు డీకే శివకుమార్‌కు బాధ్యతలు అప్పగిస్తూ పీఠం నుండి తప్పుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

జల వివాదాలపై రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక సూచన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha