Pune Porsche Case : జర్నలిజంలో ఎన్నో కలచివేసే ఘటనలు చూసినా.. ఇటీవల బయటకు వచ్చిన ఒక వీడియో మాత్రం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇది సాధారణ సెలబ్రేషన్ వీడియో కాదు..
న్యాయవ్యవస్థపైనే ప్రశ్నలు లేవనెత్తేలా ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పుణేలో జరిగిన ఫోర్షే కారు ప్రమాదంలో అనీష్ అవధియా, అశ్విని కోష్టా అనే ఇద్దరు యువ టెకీలు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశాన్ని కుదిపేసింది. కానీ అదే కేసుతో సంబంధం ఉన్న కుటుంబ సభ్యులు బెయిల్ వచ్చిన ఆనందంలో డ్యాన్స్ చేస్తూ కనిపించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
డబ్బు ముందు చట్టం బలహీనమా?
ఈ వీడియోలో కనిపించిన సెలబ్రేషన్స్ చూసి సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో స్పందనలు వస్తున్నాయి. ఇద్దరు యువకుల ప్రాణాలు కోల్పోయిన ఘటనలో కనీస పశ్చాత్తాపం కూడా కనిపించలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. 2024 మేలో జరిగిన ఈ ఘటనలో మైనర్ బాలుడు మద్యం సేవించి స్పీడ్‌గా కారు నడిపి ఇద్దరిని ఢీకొట్టాడనే ఆరోపణలు వచ్చాయి. అయితే అరెస్టు తర్వాత అతడికి వెంటనే బెయిల్ మంజూరు కావడం దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. ఎస్సే రాయడం, ట్రాఫిక్ పోలీసులతో పని చేయడం వంటి షరతులతో బెయిల్ ఇవ్వడం పెద్ద వివాదంగా మారింది.
Read Also : Karnataka politics: కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
Pune Porsche Caseరాజకీయ ప్రభావం, సాక్ష్యాల వివాదం
కేసు విచారణలో సాక్ష్యాల మార్పు, బ్లడ్ శాంపిల్స్ ట్యాంపరింగ్ వంటి ఆరోపణలు వెలుగులోకి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. కొంతమంది డాక్టర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో రాజకీయ నాయకుల జోక్యం, ప్రభావం కూడా కేసును మరింత హైలైట్ చేసింది. ఈ కేసు కేవలం రోడ్డు ప్రమాదం మాత్రమే కాదు.. డబ్బు, ప్రభావం ఉంటే చట్టాన్ని కూడా ప్రభావితం చేయవచ్చా అనే ప్రశ్నను దేశం ముందుంచిందని విశ్లేషకులు అంటున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

