Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిద్దిపేటలో అద్వితీయ ఎంటర్‌ప్రైజెస్ ప్రారంభించిన హరీశ్ రావు

సిద్దిపేటలో అద్వితీయ ఎంటర్‌ప్రైజెస్ ప్రారంభించిన హరీశ్ రావు

వార్త 1 week ago

Siddipet news: అభివృద్ధి అంటే రోడ్లు, బిల్డింగ్‌లు మాత్రమే కాదు… ప్రజలకు ఉపాధి కల్పించడమే నిజమైన అభివృద్ధి: మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అద్వితీయ ఎంటర్‌ప్రైజెస్ దుస్తుల తయారీ పరిశ్రమను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం నాలుగు రోడ్లు, బిల్డింగ్‌లు, కాలేజీలు, గుళ్లు కట్టడం లేదా కొమటిచెరువు గట్టును అభివృద్ధి చేయడం మాత్రమే నిజమైన అభివృద్ధి కాదని, ప్రజలకు ఉపాధి కల్పించి, వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయడమే అసలైన అభివృద్ధి అని స్పష్టం చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా సిద్దిపేట మహిళలకు, గృహిణులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే తన కల ఈరోజు టెక్ లైన్ మరియు అద్వితీయ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిజమవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల యూనిఫామ్స్ ఆర్డర్లతో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ, ఒక మహిళగా అద్భుతంగా రాణిస్తున్న టెక్ లైన్ అధినేత్రి శ్రీమతి భువనేశ్వరి గారి కృషిని హరీశ్ రావు గారు అభినందించారు. ఈ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుని, లాభాల కంటే పదిమందికి ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో ప్రశాంత్ నగర్‌లో ఈ పరిశ్రమను నెలకొల్పిన కో-ఆపరేటివ్ చైర్మన్ తోట శ్రీకాంత్ రెడ్డి, వారి బృందాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రస్తుతం ఇక్కడ 70 మంది మహిళలు పని చేస్తున్నారని, త్వరలోనే 100 మంది స్టిచ్చింగ్, మరో 100 మంది ప్యాకింగ్ విభాగాల్లో… మొత్తంగా 200 మంది మహిళలకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని ఆయన తెలిపారు.

Read also: CM Revanth Visit to Palamuru: సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటన

Siddipet news: సిద్దిపేటలో మహిళలకు ఉపాధి అవకాశాలు

సాధారణంగా నెల రోజుల్లో నేర్చుకునే పనిని సిద్దిపేట మహిళలు తమ నైపుణ్యంతో కేవలం 4 రోజుల్లోనే నేర్చుకున్నారని భువనేశ్వరి గారు చెప్పడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. మహిళలంతా క్రమశిక్షణతో, నాణ్యతతో పనిచేసి ఈ సంస్థకు మంచి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని పిలుపునిచ్చారు. పనితనం బాగుంటే భువనేశ్వరి గారు మరిన్ని ఆర్డర్లు ఇస్తారని, తద్వారా ఈ 200 మంది ఉపాధి రేపు 400, ఆపై 800 మందికి పెరుగుతుందని వివరించారు. గతంలో సిద్దిపేటలో 6 వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చినప్పటికీ, అవి కేవలం ఇళ్ల వరకు మాత్రమే పరిమితమయ్యాయని.. కానీ కమర్షియల్‌గా, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే అద్వితీయ సంస్థలో ఏర్పాటు చేసిన అధునాతన లేటెస్ట్ టెక్నాలజీ మిషన్లు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. మహిళల శ్రమ, క్వాలిటీ ఆధారంగానే సిద్దిపేట భవిష్యత్తులో భారతదేశానికి రెండవ సోలాపూర్ గా మారే అవకాశం ఉందన్నారు. ఈ సంస్థను మరింత విస్తరించేందుకు వీలుగా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలతో తానే స్వయంగా మాట్లాడి మరిన్ని ఆర్డర్లు వచ్చేలా శ్రీకాంత్ రెడ్డికి పూర్తి సహకారం అందిస్తానని హరీశ్ రావు గారు హామీ ఇచ్చారు. దేశంలో రూ. 60,000 కోట్ల టెక్స్‌టైల్ బిజినెస్‌లో 70% స్టిచ్చింగ్ రంగానిదేనని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సంస్థను తమ సొంత సంస్థగా భావించి కష్టపడితే, సంస్థ బలపడి తద్వారా మహిళల వేతనాలు కూడా పెరుగుతాయని చెబుతూ ఉద్యోగినులకు ఆయన ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha