Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిద్దిపేటలో పరారైన నిందితుడు 24 గంటల్లో అరెస్ట్

సిద్దిపేటలో పరారైన నిందితుడు 24 గంటల్లో అరెస్ట్

వార్త 1 week ago

Siddipet Escaped Prisoner: సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోలీసుల కళ్లు గప్పి పరారైన నిందితుడిని సిద్దిపేట పోలీసులు కేవలం 24 గంటల్లోనే చాకచక్యంగా పట్టుకున్నారు.జూలై 25న మధ్యాహ్నం నిందితుడిని సాధారణ వైద్య పరీక్షల (జనరల్ చెకప్) నిమిత్తం జైలు సిబ్బంది సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ఆ సమయంలో పోలీస్ వ్యాన్‌లో ఉన్న నిందితుడు తన చేతులకు ఉన్న సంకెళ్లను ఊడదీసుకుని, వాహనం అత్యవసర ద్వారం (ఎమర్జెన్సీ డోర్) నుంచి బయటకు దూకాడు. అనంతరం సమీపంలోని సందులోంచి పారిపోతూ కోమటిచెరువు కట్టపై ఉన్న ఒక బైక్‌ను దొంగిలించి అక్కడి నుండి పరారయ్యాడు.

24 గంటల్లోనే కామారెడ్డిలో అరెస్టు

ఈ ఘటనపై వెంటనే స్పందించిన సిద్దిపేట పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌లు మరియు ఇతర సమాచార ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నిందితుడు కామారెడ్డి ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, ఆదివారం మధ్యాహ్నం సుమారు 12:00 గంటలకు కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Siddipet Escaped Prisoner: పోలీసు బృందాలకు సీపీ రష్మీ పెరుమాళ్ అభినందనలు

పరారైన 24 గంటల్లోపే నిందితుడిని చాకచక్యంగా గుర్తించి అరెస్టు చేసిన ప్రత్యేక పోలీసు అధికారులను, సిబ్బందిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ (CP) రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ అభినందించారు. విధి నిర్వహణలో వారు చూపిన సమయస్ఫూర్తి, నిబద్ధత మరియు సమన్వయాన్ని సీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు.

సిద్దిపేటలో పోలీసుల కళ్లు కప్పి ఖైదీ పరారీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha