Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిద్దిపేటలో పోలీసుల కళ్లు కప్పి ఖైదీ పరారీ

సిద్దిపేటలో పోలీసుల కళ్లు కప్పి ఖైదీ పరారీ

వార్త 1 week ago

Siddipet Prisoner Escape: సిద్దిపేట జిల్లా కేంద్రంలో శనివారం తీవ్ర కలకలం రేగింది. జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ పోలీసుల కళ్లు గప్పి ఆసుపత్రి ప్రాంగణం నుండి పరారయ్యాడు.వివరాల్లోకి వెళితే..

సిద్దిపేట జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలను సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం శనివారం నాడు సిద్దిపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం ఖైదీలను తిరిగి పోలీసు వాహనంలోకి ఎక్కిస్తుండగా, సాయి కుమార్ అనే ఖైదీ అత్యవసర ద్వారము (ఎమర్జెన్సీ డోర్) ద్వారా చాకచక్యంగా పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు.

పరారైన ఖైదీ సాయి కుమార్ పలు ద్విచక్ర వాహనాల (బైక్) దొంగతనం కేసుల్లో నేరస్థుడిగా శిక్ష అనుభవిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పట్టపగలే ఖైదీ పరారవ్వడంతో సిద్దిపేట త్రీ-టౌన్ పోలీసులు మరియు సాయుధ దళాల సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. జిల్లా సరిహద్దులను, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను అప్రమత్తం చేసి, పరారైన ఖైదీ సాయి కుమార్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Epaper: epaper.vaartha.com

సవతి కొడుకుతో అక్రమ సంబంధం, వద్దని పెళ్లికి సిద్ధపడితే సుపారీ ఇచ్చి హత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha