Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిద్దిపేటలో విషాదం..బావిలో కారు పడి ఒకే కుటుంబంలోని నలుగురి దుర్మరణం

సిద్దిపేటలో విషాదం..బావిలో కారు పడి ఒకే కుటుంబంలోని నలుగురి దుర్మరణం

వార్త 1 month ago

Siddipet Road Accident: సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం అలముకుంది. ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ హృదయ విదారకమైన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి వెలుగు చూసింది.

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

దుబ్బాక మండలం బలవంతాపూర్ గ్రామానికి చెందిన రాజు, తన భార్య భాగ్య, కుమారుడు నియాన్ష్, కుమార్తె శాన్వికతో కలిసి సిద్దిపేటలో జరిగిన వేడుకకు వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత రాత్రి సమయంలో అందరూ కలిసి కారులో స్వగ్రామానికి పయనమయ్యారు. అయితే ఎంతకీ ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

Siddipet Road Accident: మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా బావిలో కారు గుర్తింపు

పోలీసులు రంగంలో రంగంలోకి దిగి బాధితుడి మొబైల్ ఫోన్ లొకేషన్ సిగ్నల్స్ ద్వారా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అప్పనపల్లి శివారు వద్దకు చేరుకునేసరికి సిగ్నల్స్ నిలిచిపోవడంతో అక్కడ కూలంకషంగా పరిశీలించారు. రోడ్డు పక్కన ఉన్న లోతైన బావిలో కారు మునిగిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై సహాయక బృందాల సహాయంతో కారును, అందులోని మృతదేహాలను బయటకు వెలికితీశారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఈ ప్రమాదంలో రాజు, భాగ్య, వారి పిల్లలు నియాన్ష్, శాన్విక లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు ధృవీకరించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కారు బావిలో పడటానికి గల అసలు కారణాలపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Epaper: epaper.vaartha.com

మహిళ కడుపులో 3 కిలోల కణితి తొలగింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha