Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం చంద్రబాబుపై రాజ్‌నాథ్ ప్రశంసలు

సీఎం చంద్రబాబుపై రాజ్‌నాథ్ ప్రశంసలు

వార్త 1 week ago

Rajnath Singh Puttaparthi Visit: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సరికొత్త మైలురాయి లిఖించబడింది. రాష్ట్రాన్ని దేశ రక్షణ రంగ హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం భారీ అడుగు వేసింది.

అనంతపురం జిల్లా పుట్టపర్తి వేదికగా శుక్రవారం (మే 15) వేల కోట్ల రూపాయల విలువైన నాలుగు కీలక రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు.భారత రక్షణ రంగ స్వావలంబన (ఆత్మనిర్భరత) ప్రయాణంలో ఈ ప్రాజెక్టులు అత్యంత కీలకమైనవని రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ మెగా కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Read Also: AI Services in Indrakeeladri: భక్తుల కోసం ఇంద్రకీలాద్రి పై AI టెక్నాలజీ ?

ఏపీ అంటే 'అడ్వాన్స్‌డ్ ప్రదేశ్': రాజ్‌నాథ్ సింగ్

ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విజన్‌పై, పాలనా సామర్థ్యంపై ప్రశంసల జల్లు కురిపించారు."నా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎందరో నేతలను చూశాను. కానీ చంద్రబాబుకు టెక్నాలజీపై ఉన్న పట్టు, భవిష్యత్తును అంచనా వేయగల దూరదృష్టి చాలా అరుదైనవి. ఆయన ఆలోచనలు ఎప్పుడూ దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి" అని కొనియాడారు.

 Defense Projects in AP

గూగుల్ (Google) వంటి గ్లోబల్ టెక్ దిగ్గజం తన ప్రతిష్టాత్మక ఏఐ (AI) డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోవడమే చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌కు, నమ్మకానికి నిదర్శనమని రాజ్‌నాథ్ గుర్తు చేశారు.చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు.. 'అడ్వాన్స్‌డ్ ప్రదేశ్' (Advanced Pradesh) గా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Rajnath Singh Puttaparthi Visit: రాష్ట్రానికి చేకూరనున్న లబ్ధి

ఈ నాలుగు రక్షణ రంగ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ ప్రాంతంలో వేల కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున సాంకేతిక మరియు పారిశ్రామిక రంగాలలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రక్షణ రంగానికి అవసరమైన అధునాతన పరికరాల తయారీకి అనంతపురం జిల్లా కేంద్ర బిందువుగా మారబోతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పుట్టపర్తిలో మూడు కీలక డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha