Dailyhunt
సీఎం జన్మదిన వేడుకల్లో సేవామయ శోభ: మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి!

సీఎం జన్మదిన వేడుకల్లో సేవామయ శోభ: మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి!

వార్త 1 week ago

Blood Donation Camp Kalyanadurgam: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 20న కళ్యాణదుర్గం ప్రజా వేదికలో నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని టీడీపీ సీనియర్ నేత మోరేపల్లి మల్లికార్జున పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు.సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రక్తదానం అనేది కేవలం సేవ మాత్రమే కాదు, ప్రాణాలను కాపాడే మహోన్నత కార్యమని పేర్కొన్నారు.

Read Also:AP Half Day Schools: మండుతున్న ఎండలు: స్కూళ్లు 11 గంటలకే ముగించాలని ఉపాధ్యాయుల విజ్ఞప్తి

రక్తదానం – ప్రాణ దానంతో సమానం

అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి ఇది పునర్జన్మనిచ్చే అవకాశాన్ని కల్పిస్తుందని అన్నారు. రక్తదానం చేస్తే బలహీనత వస్తుందనే అపోహలు ప్రజలు విడనాడాలని సూచించారు. వైద్యుల ప్రకారం రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతూ ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. రక్తదానం అనేది మనిషి చేయగలిగే అత్యున్నత సేవల్లో ఒకటని, ఒక యూనిట్ రక్తం మూడు ప్రాణాలను కాపాడగలదన్నారు.

అందుకే "ఈరోజు రక్తదానం - రేపటి ప్రాణ రక్షణ" అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనే ప్రతి రక్తదాతకు రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సేవా కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థతో పాటు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్య బృందం పాల్గొని ఆరోగ్య సేవలు అందించనున్నట్లు చెప్పారు.ముఖ్యమంత్రి జన్మదినాన్ని సేవా దృక్పథంతో జరుపుకుంటూ, ఎక్కువ యూనిట్ల రక్త సేకరణ ద్వారా చరిత్ర సృష్టించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Blood Donation Camp Kalyanadurgam: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

ఈ నెల 14న భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. దళిత సామాజిక వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో వైపీ రమేష్, టీఆర్ తిప్పేస్వామి, ధనుంజయ, శివన్న, మురళి తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

వేసవిలో ఈత, నీటి ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha