Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం మార్పుపై మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన

సీఎం మార్పుపై మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన

వార్త 1 month ago

ర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగుతుందంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలకు కాంగ్రెస్ అధిష్ఠానం ముగింపు పలికింది. ప్రస్తుతానికి సిద్ధరామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఖర్గే స్పష్టం చేశారు.

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని జరుగుతున్న ప్రచారాన్ని మల్లికార్జున ఖర్గే ఖండించారు. ప్రస్తుతానికి సీఎం మార్పు ప్రతిపాదన ఏదీ లేదని ఆయన తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో తలెత్తిన చిన్నపాటి నాయకత్వ సమస్యలను త్వరలోనే సామరస్యంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

Read Also: Salvo Launch : సాల్వో లాంచ్ విజయవంతం.. DRDO లో అపూర్వ విజయం

 Karnataka Politics

Karnataka Politics: మే 4 ఫలితాల అనంతరం కీలక పరిణామాలు?

కర్ణాటకలోని రెండు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. ఈ ఫలితాల తర్వాతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లేదా ఇతర మార్పులపై హైకమాండ్ దృష్టి సారించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితాల తర్వాత సిద్ధరామయ్యను మారుస్తారనే చర్చ జోరుగా సాగుతున్న తరుణంలో ఖర్గే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2023 ఎన్నికల విజయం తర్వాత కర్ణాటక కాంగ్రెస్‌లో ఇద్దరు అగ్రనేతల మధ్య సయోధ్య కుదిరింది. సిద్ధరామయ్య ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య పదవీ కాలానికి సంబంధించిన ఒప్పందం కుదిరిందని సమాచారం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తండ్రికి విలువ ఇవ్వని మనిషి.. తల్లి ఎలా అవుతుంది?.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha