Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం పదవికి రాజీనామా చేయను ఇది "ప్రజాస్వామ్య హత్య".. మమతా బెనర్జీ

సీఎం పదవికి రాజీనామా చేయను ఇది "ప్రజాస్వామ్య హత్య".. మమతా బెనర్జీ

వార్త 1 month ago

West Bengal Election: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 294 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 207 సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధించగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) కేవలం 80 స్థానాలకే పరిమితమైంది.

అయితే, ఈ ఫలితాలను సీఎం మమతా బెనర్జీ పూర్తిగా తిరస్కరించారు. తాను పదవికి రాజీనామా చేయబోనని, ఈ ఓటమిని చట్టబద్ధంగా అంగీకరించబోమని ఆమె సంచలన ప్రకటన చేశారు.

బీజేపీ 100 స్థానాలను దొంగిలించింది!

కోల్‌కతాలో సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు. బీజేపీ దాదాపు 100 స్థానాలను అక్రమ పద్ధతుల్లో దొంగిలించిందని ఆరోపించారు. కుట్రపూరితంగా దాదాపు 90 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్, కేంద్ర బలగాలు ఏకపక్షంగా వ్యవహరించి బీజేపీకి సహకరించాయని విమర్శించారు.

Read Also : West Bengal: బెంగాల్‌లో ఎన్నికల సెగ.. TMC కార్యాలయాలకు నిప్పు!

 Mamata’s sensational allegations against BJP: 100 seats stolen.

West Bengal Election: భవానీపూర్‌లో ఓటమి.. కానీ తగ్గని పోరాటం

తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో ఓటమి పాలైనప్పటికీ, మమత వెనక్కి తగ్గలేదు. “ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. కౌంటింగ్ కేంద్రానికి వెళ్తున్న సమయంలో నాపై భౌతిక దాడికి ప్రయత్నించారు. సీఆర్‌పీఎఫ్ బలగాలు గూండాల్లా ప్రవర్తించాయి” అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై నిజ నిర్ధారణ కోసం 15 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

మమతకు ‘ఇండియా’ కూటమి మద్దతు

ఈ క్లిష్ట పరిస్థితుల్లో విపక్ష కూటమి ‘ఇండియా’ (INDIA) నేతలు మమతా బెనర్జీకి అండగా నిలిచారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ వంటి నేతలు ఫోన్ చేసి ఆమెకు తమ సంఘీభావాన్ని తెలిపారని మమత వెల్లడించారు. బెంగాల్ చరిత్రలో ఈ ఫలితాల రోజును ఒక ‘చీకటి రోజు’గా ఆమె అభివర్ణించారు. మెజారిటీ సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుండగా, మమత తీసుకున్న ఈ నిర్ణయం బెంగాల్ రాజకీయాల్లో రాజ్యాంగ సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

రేపు తమిళనాడు గవర్నర్‌తో భేటీకానున్న TVK చీఫ్ విజయ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha