కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ తరపున పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పినరయి విజయన్‌ను ఉద్దేశించి 'నీ పో మోనే విజయ' (విజయన్ ఇక వెళ్లు..
నీ పని అయిపోయింది) అని వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. దీనిపై కన్నూర్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో విజయన్ తీవ్రంగా స్పందించారు. ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉండి, తోటి ముఖ్యమంత్రిపై ఇటువంటి అగౌరవకరమైన భాషను ఉపయోగించడం రేవంత్ రెడ్డి స్థాయికి తగదని మండిపడ్డారు. తన ప్రసంగాల్లో కనీస ప్రమాణాలను పాటించకపోవడంపై ఆత్మపరిశీలన చేసుకోవాలని రేవంత్‌కు హితవు పలికారు. రేవంత్ విమర్శలకు ప్రతిగా విజయన్ కూడా మలయాళంలో వ్యంగ్యంగా ఉపయోగించే “దశ మోనే రేవంత” అనే పదాన్ని ప్రయోగించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also : NTR-NEEL Dragon Shooting Stopped: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాక్ ?

సరైన సమయంలో సమాధానం ఇస్తా
ఎన్నికల ప్రచారం చివరి దశలో ఉండటం వల్ల హడావిడి ఎక్కువగా ఉందని, అందుకే రేవంత్ చేసిన అన్ని విమర్శలపై ఇప్పుడు సుదీర్ఘంగా స్పందించడానికి తనకు సమయం లేదని పినరయి విజయన్ పేర్కొన్నారు. అయితే, సమయం వచ్చినప్పుడు అన్నింటికీ తగిన రీతిలో బదులిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వకుండా ప్రవర్తించిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యక్తిగత దూషణలకు దిగడం కేరళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. రేవంత్ వ్యాఖ్యలు తనను వ్యక్తిగతంగానే కాకుండా, రాజకీయంగా కూడా కించపరిచేలా ఉన్నాయని విజయన్ భావిస్తున్నట్లు ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది.
మూడోసారి ఎల్డీఎఫ్ విజయం ఖాయం.. ప్రతిపక్షాలకు సున్నా!
ఇక ఎన్నికల ఫలితాలపై ధీమా వ్యక్తం చేస్తూ, కేరళ ప్రజలు మళ్లీ సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ (LDF) ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని విజయన్ ధీమా వ్యక్తం చేశారు. 2021 ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలతో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తామని ఆయన జోస్యం చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని గమనించినప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమికి తిరస్కరణే ఎదురవుతోందని, అలాగే బీజేపీ కూటమికి ఒక్క సీటు కూడా రాదని (గుండు సున్నా) ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి వంటి ఇతర రాష్ట్రాల నేతలు వచ్చి ఎన్ని విమర్శలు చేసినా, కేరళ ఓటర్లు అభివృద్ధిని చూసి తమకే పట్టం కడతారని విజయన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
పెళ్లి చేసుకుని నలుగురు పిల్లల్ని కన్నానంటూ వ్యంగ్యంగా కామెంట్స్

