Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం రేవంత్ రాకతో తెలంగాణలో హీట్.. సాయంత్రం ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ

సీఎం రేవంత్ రాకతో తెలంగాణలో హీట్.. సాయంత్రం ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ

వార్త 2 months ago

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన యూకే, యూఎస్ పర్యటనల కోసం ఆగస్టు 20న బయలుదేరారు.

ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలతో పాటు లండన్ బిజినెస్ స్కూల్‌లో పర్యటించి, ప్రవాస తెలుగువారితో సమావేశమయ్యారు. అయితే, ఆయన అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ రాజకీయ అనుమతి నిరాకరించింది. ఈ పరిణామంపై ఆయన లండన్‌లోనే స్పందిస్తూ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో 'కొండా ఎపిసోడ్' కలకలం

సీఎం రాష్ట్రంలో లేని సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పరకాల నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి మద్దతు ఇస్తామన్న సీఎం ప్రకటనను ఆమె బహిరంగంగా వ్యతిరేకించారు. “రేవంత్ రెడ్డి వచ్చినా, ఆయన తాత వచ్చినా పరకాలలో గెలిచేది నేనే” అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమశిక్షణారాహిత్య ఘటనపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Revanth Reddy: సాయంత్రం మీడియా సమావేశంపై సర్వత్ర ఉత్కంఠ

అమెరికా పర్యటన రద్దు వెనుక ఉన్న రాజకీయ పరిణామాలు మరియు సొంత పార్టీలో కొండా కుటుంబం సృష్టించిన వివాదం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేపట్టబోయే మీడియా సమావేశంపై రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు కీలక అంశాలపై ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది కాంగ్రెస్ వర్గాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

22A బాధితులకు హరీశ్‌రావు భరోసా.. న్యాయం జరిగే వరకు పోరాటం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha