Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఒక విహారయాత్ర.. శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఒక విహారయాత్ర.. శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

వార్త 1 week ago

Minister Srinivas Goud: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLI) పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి వి.

శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రాజెక్టుల సందర్శన కోసం పాదయాత్రకు సిద్ధమైన తరుణంలోనే, ప్రభుత్వానికి అకస్మాత్తుగా ప్రాజెక్టుల తనిఖీలు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిని బట్టే ప్రాజెక్టుల పూర్తిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో స్పష్టమవుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

Read also: Gutha Sukhender Reddy: పవన్ కల్యాణ్ భాష, తీరు బాలేదు.. ఏపీ కూటమి నేతలపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్!

కేసీఆర్ హయాంలోనే 90 శాతం పనులు పూర్తి.. రేవంత్ టూర్ కేవలం పబ్లిసిటీ కోసమే!

గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన 80 నుంచి 90 శాతం పనులు విజయవంతంగా పూర్తయ్యాయని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. అయితే, మిగిలిపోయిన కొద్దిపాటి పనులను పూర్తి చేయకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా చేసిన ప్రాజెక్టుల సందర్శన కేవలం ప్రచారం కోసమేనని, అదంతా ఒక ‘హెలికాప్టర్ విహారయాత్ర’ (పిక్నిక్) లాగా సాగిందని విమర్శించారు. కేవలం ఫోటోలకు, పబ్లిసిటీకే సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.

రైతుల నిర్లక్ష్యం.. శ్రీధర్ రెడ్డి హత్య కేసుపై పురోగతి శూన్యం

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధిని ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టిందని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఏర్పాటు చేయాల్సిన హార్టికల్చర్, పాలిటెక్నిక్ కాలేజీల ఊసే ఎత్తడం లేదని, స్థానిక మామిడి రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదని ధ్వజమెత్తారు. వీటితో పాటు, బీఆర్‌ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య జరిగి రెండేళ్లు గడుస్తున్నా.. ఆ కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని తప్పుపట్టారు. ముఖ్యమంత్రి పర్యటనల పేరుతో ప్రతిపక్ష నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి వినోదపు పర్యటనలు ఆపేసి, పాలమూరు ప్రాంత అసలు సమస్యలపై మరియు ‘రామన్నగుట్ట రిజర్వాయర్’ నిర్మాణంపై తక్షణమే స్పష్టమైన సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha