Revanth Reddy Foreign Tour: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ ప్రత్యేక కోర్టు (ACB Special Court) షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.
ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా కోర్టు కస్టడీలో ఉన్న ఆయన పాస్‌పోర్టును తాత్కాలికంగా విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
Read Also :Graduation Voter Notification : సెప్టెంబర్‌లో గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు..!

విదేశీ పర్యటన వివరాలు
- పర్యటన సమయం: ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటించనున్నారు.
- పర్యటించే దేశాలు: యూకే (UK), అమెరికా (USA), జర్మనీ, చైనా.
- లక్ష్యం: తెలంగాణ రాష్ట్రానికి భారీగా విదేశీ పెట్టుబడులను (Foreign Investments) ఆకర్షించడమే ధ్యేయంగా ఈ పర్యటన సాగనుందని సీఎం తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.
Revanth Reddy Foreign Tour: ఏసీబీ కోర్టు విధించిన ప్రధాన షరతులు
- పూచీకత్తు: రూ. 1 లక్ష వ్యక్తిగత బాండ్‌తో పాటు ఒక ష్యూరిటీని కోర్టుకు సమర్పించాలి.
- ప్రయాణ వివరాలు: విదేశీ పర్యటనకు సంబంధించిన సమగ్ర షెడ్యూల్, అక్కడ బస చేసే హోటల్/చిరునామాలు మరియు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లను కోర్టుకు అందజేయాలి.
- పాస్‌పోర్ట్ పునఃసమర్పణ: పర్యటన ముగిసిన అనంతరం సెప్టెంబర్ 18లోగా పాస్‌పోర్టులను తిరిగి కోర్టులో జమ చేస్తానని అఫిడవిట్ దాఖలు చేయాలి.
ఈ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి (RPO)కి లేఖ రాసి

