Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో గల ఆయన నివాసంలో తెలంగాణ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరులో అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు
సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణ పోలీసులు గుంటూరుకు వెళ్లారు. నాగార్జున యాదవ్‌ను అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులకు అధికారికంగా సమాచారం అందించారు. అనంతరం స్థానిక నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను నమోదు చేసి, ఆయన్ను విచారణ నిమిత్తం తెలంగాణకు తరలించారు. పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ నేతను తెలంగాణ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం ఇప్పుడు ఇరు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Revanth Reddy: ‘జొమాటో డెలివరీ బాయ్’ అంటూ కామెంట్స్..
ఇటీవల ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్‌లో నాగార్జున యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిని ‘జొమాటో డెలివరీ బాయ్’ అని సంబోధించడంతో పాటు, ఆయనకు కనీసం జీవోలు (GOs) చదవడం కూడా రాదంటూ వ్యాఖ్యానించారు. గతంలో ఎమ్మెల్యేగా కూడా ఆయన సమర్థంగా పని చేయలేదంటూ ఆరోపించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై నమోదైన ఫిర్యాదుతోనే ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు కూడా ధృవీకరించాయి.
ఉండవల్లిలో గాయని ఎస్. జానకి ఘనంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు!

