CM MK Stalin Assets Affidavit: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం వేడెక్కుతున్న వేళ, రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ తన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
చెన్నైలోని కొళత్తూర్ నియోజకవర్గం నుండి ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. విశేషమేమిటంటే, ఈ నియోజకవర్గం నుండి స్టాలిన్ పోటీ చేయడం ఇది వరుసగా నాలుగోసారి. నామినేషన్ అనంతరం ఆయన భారీ రోడ్ షో నిర్వహించి ఓటర్లను ఆకట్టుకున్నారు.
Read Also:Karnataka theft news : అర్థరాత్రి ఇళ్లలోకి దూకి లోదుస్తులే దొంగిలింపు
CM MK Stalin Assets Affidavit: ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాల వెల్లడి
నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో సీఎం స్టాలిన్ తన ఆస్తుల వివరాలను బహిరంగపరిచారు. గత ఎన్నికలతో పోలిస్తే ఆయన ఆస్తుల్లో పెద్దగా మార్పులు లేకపోవడం గమనార్హం.ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించిన వివరాల ప్రకారం తమిళనాడు సీఎం స్టాలిన్ ఆస్తుల విలువ రూ. 6.26 కోట్లుగా ఉంది. అందులో రూ. 3.30 కోట్ల చరాస్తులు, రూ. 2.96 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఇక సీఎం స్టాలిన్ వార్షిక ఆదాయం గత ఆర్థిక సంవత్సరం ప్రకారం రూ. 31 లక్షలుగా ఉంది.
CM MK Stalin Nomination
వార్షిక ఆదాయం, ఇతర వివరాలు
అలాగే తన వద్ద ప్రస్తుతం రూ. 10 వేల నగదు ఉన్నట్లు సీఎం స్టాలిన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.ఇక సీఎం స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ ఆస్తుల వివరాలు చూస్తే.. చరాస్తులు రూ. 1.32 కోట్లు కాగా స్థిరాస్తులు రూ. 2.10 కోట్లుగా ప్రకటించారు. ఆమె వార్షిక ఆదాయం గతేడాది రూ. 5.33 లక్షలు కాగా ప్రస్తుతం దుర్గా స్టాలిన్ చేతిలో రూ. 40 వేలు నగదు ఉన్నట్లు తెలిపారు. ఇక అన్నింటికంటే విచిత్రం ఏంటంటే..
ముఖ్యమంత్రి స్టాలిన్ పేరు మీద ఎటువంటి మోటార్ వాహనాలు లేదా కార్లు లేకపోవడం..అలాగే సీఎం స్టాలిన్.. తన వద్ద ఎటువంటి బంగారం కానీ వెండి ఆభరణాలు కానీ లేవని ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు. అయితే ఆయన భార్య దుర్గా స్టాలిన్ వద్ద మాత్రం 720 గ్రాముల పాత బంగారు ఆభరణాలు (సుమారు 90 తులాల బంగారం) ఉన్నట్లు ప్రకటించారు. వీటి ప్రస్తుత విలువ రూ. 84 లక్షలుగా పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

