Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సీఎం విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుంది': ఎంకే స్టాలిన్

'సీఎం విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుంది': ఎంకే స్టాలిన్

వార్త 6 days ago

మిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వంపై ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న విజయ్ ప్రభుత్వం ఎక్కువ కాలం సాగదని, అది ఎప్పుడైనా కూలిపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు.

Read Also: SBI Bank Holidays: వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్?

 TVK

TVK: డీఎంకే అంతర్గత సమావేశంలో దిశానిర్దేశం

చెన్నైలో జరిగిన డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శుల కీలక సమావేశంలో ఎంకే స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపేందుకు ఆయన ప్రయత్నించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, తమ పార్టీకి ఎదురైన ఈ ఓటమి కేవలం తాత్కాలికం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. నేతలు, కార్యకర్తలు అధైర్యపడకుండా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ స్టాలిన్ కీలక అంచనా వేశారు. తమిళనాడులో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. 2029లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలతో పాటే, తమిళనాడులో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha