YS Jagan congratulates CM Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని ఘనవిజయ తీరాలకు చేర్చి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.
గురువారం ఉదయం విజయ్‌కు ఫోన్ చేసిన జగన్, ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినందుకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు..
Read Also:Kalyandurgam MLA : మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి: ఎమ్మెల్యే సురేంద్ర బాబు
YS Jagan congratulates CM Vijay: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి: జగన్
తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా సమర్థవంతమైన, పారదర్శకమైన పాలన అందించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధితో పాటుగా ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు టీవీకేతో పాటుగా (మీ) విజయ్ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారని.. దాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను, ఆకాంక్షల్ని నెరవేర్చాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ పాలన దిశగా ముందుకు సాగాలన్నారు. విజయ్ నాయకత్వంలో తమిళనాడు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
YS Jagan congratulates CM Vijay Tamil Nadu
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com

