Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం విజయ్‌ను పేరుతో పిలవొద్దు.. డిప్యూటీ స్పీకర్!

సీఎం విజయ్‌ను పేరుతో పిలవొద్దు.. డిప్యూటీ స్పీకర్!

వార్త 1 week ago

Tamil Nadu politics: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) తొలిసారిగా ప్రజల్లోకి వస్తున్నారు.

సోమవారం సాయంత్రం ఆయన తాను గెలిచిన తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే, సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన సందర్భంగా జర్నలిస్ట్‌లను ఉద్దేశించి తమిళనాడు డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ముఖ్యమంత్రి విజయ్ తొలి పర్యటన కావడంతో తిరుచ్చి జిల్లా యంత్రాంగం మరియు టీవీకే (TVK) శ్రేణులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. స్థానిక సెయింట్‌ జోసెఫ్స్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 10 వేల మంది వరకు పాల్గొంటారని అంచనా. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా తిరుచ్చి జిల్లా వ్యాప్తంగా డ్రోన్లు ఎగురవేతపై జిల్లా కలెక్టర్‌ కఠిన నిషేధం విధించారు.

Read Also: Atlanta Kerala Couple Helicopter Crash:పెళ్లయిన 10 గంటలకే హెలికాప్టర్ ప్రమాదం.. కేరళకు చెందిన వరుడు మృతి!

 Don’t call CM Vijay by his name.. Deputy Speaker!

Tamil Nadu politics: ప్రెస్ మీట్‌లో అసలేం జరిగిందంటే..?

ఆదివారం సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం డిప్యూటీ స్పీకర్‌ రవిశంకర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ఒక ప్రశ్న వివాదానికి దారితీసింది.

“విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్‌ స్థానానికి త్వరలో ఉప-ఎన్నిక జరగనుంది కదా.. ఈ ఉప-ఎన్నికల్లో మీకు టిక్కెట్ ఇచ్చే అంశాన్ని విజయ్‌ పరిశీలిస్తున్నారా?”

డిప్యూటీ స్పీకర్ అభ్యంతరం

జర్నలిస్టులు సీఎంను ‘విజయ్’ అని సంబోధించడంపై రవిశంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆయనను విజయ్‌ అని అనకూడదు.. ముఖ్యమంత్రి లేదా సీఎం అని మాత్రమే అనాలి. తాము విజయ్‌ అని చెప్పొచ్చు కానీ, ప్రెస్ వాళ్లు అలా అనకూడదు” అంటూ కామెంట్ చేశారు. దీనికి జర్నలిస్ట్‌లు కూడా తడుముకోకుండా బదులిస్తూ.. తాము పౌరులుగా, మీడియాగా ‘విజయ్‌’ అని సంబోధించొచ్చునని, పార్టీ డిసిప్లిన్ ప్రకారం మీరే అలా అనకూడదని కౌంటర్ ఇచ్చారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సామూహిక వేదికపై బీజేపీ ఎమ్మెల్యే వివాహం.. ఎడ్లబండిపై ఊరేగింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha