Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం, మంత్రుల మీదే కేసు పెట్టాలి.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

సీఎం, మంత్రుల మీదే కేసు పెట్టాలి.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

వార్త 3 weeks ago

Laxma Reddy: గత రెండు మూడు రోజులుగా అసెంబ్లీ పొద్దా BRS నేతలపై పోలీసుల తీరు, తదుపరి జరుగుతున్న పరిణామాలు అన్నిటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణం అని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో శ్వేతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ చికిత్స శిబిరం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. కేటీఆర్ హరీష్ రావులపై లైంగిక వేధింపుల కేసు అంశంపై ఆయన తీవ్రంగా స్పందించి మండిపడ్డారు.

Read Also : BRS : కేటీఆర్ హరీష్ రావు లపై లైంగిక వేధింపుల కేసులు..అభియోగాలు రుజువైతే ఎంతకాలం శిక్ష పడుతుందో తెలుసా ?

 Cases should be filed against the CM and ministers: Former Minister Laxma Reddy

Laxma Reddy: అసెంబ్లీ వద్ద ప్రభుత్వ దురుద్దేశం

అసెంబ్లీ వద్ద రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతోనే కావాలనే మహిళ ప్రజా ప్రతినిధుల వద్ద మగ పోలీసులను, మగ ప్రజా ప్రతినిధుల వద్ద ఆడ పోలీసులను ఉంచి ఈ రచ్చ జరగడానికి కారణం అయ్యారని పేర్కొన్నారు. అసెంబ్లీలో పలానా డ్రెస్సు వేసుకొని రావాలని ఎక్కడా లేదని, కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో నల్ల చుక్కలు ధరించి నిరసన తెలిపితే తప్పులేదు కానీ తెలంగాణ అసెంబ్లీలో BRS నాయకులు నిరసన తెలిపేందుకు వెళితే అరెస్టులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల తీరు అత్యంత బాధాకరం అన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో భయాందోళన అభద్రతాభావానికి గురిచేసి ఓ చర్చకు దారి తీసింది అన్నారు.

రైస్ మిల్లింగ్ రంగాన్ని కాపాడుకుందాం: రైస్ మిల్లర్స్ అసోసియేషన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha