Dailyhunt
సిఎస్ఎస్ఆర్ పోటీల్లో ఎపిఎస్టిఆర్ఎఫ్ సత్తా

సిఎస్ఎస్ఆర్ పోటీల్లో ఎపిఎస్టిఆర్ఎఫ్ సత్తా

వార్త 2 weeks ago

APSTRF in CSSR Competitions: జాతీయ స్థాయి సిఎస్ఎస్ఆర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎపిఎస్టిఆర్ఎఫ్) ప్రతిభ చాటుకుంది.

న్యూఢిల్లీలోని ఘజియాబాద్లో 8వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన పోటీల్లో ఎనిమిది రాష్ట్రాలకు బీహార్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, దాద్రా నగర్ హవేలి, డామన్ డయ్యూ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ చెందిన బృందాలు పాల్గొనగా, ఎపిఎస్ఆర్ఎఫ్ జట్టు రన్నర్అప్-2గా నిలిచింది. ఈ జట్టుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, ఎన్ఐఆర్ఎఫ్ డిజి పీయూష్ ఆనంద్ చేతుల మీదుగా ట్రోఫీతో పాటు రూ.50 వేల నగదు బహుమతిని అందుకుంది.

Read Also: kaleshwaram project : కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వేడి

APSTRF in CSSR Competitions: రూ.75 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించిన డిజిపి హరీష్ కుమార్ గుప్త

అంతకు ముందు నిర్వహించిన రీజినల్ స్థాయి పోటీల్లోనూ ఎపిఎస్ఆర్ఎఫ్ జట్టు రన్నరప్ నిలిచి తన ప్రతిభను చాటుకుంది. ఈ పోటీల్లో దక్షిణ భారత రాష్ట్రాలకు చెందిన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ చెందిన టీంలు పాల్గొన్నాయి.

పోటీల్లో విజయం సాధించిన బృందాన్ని రాష్ట్ర డిజిపి హరీష్కుమార్ గుప్తా అభినందించి రూ.75వేల నగదు ప్రోత్సాహకాన్ని గురువారం మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన డిజిపి హరీష్కుమార్ గుప్తా మాట్లాడుతూ, ఎపిఎస్ఆర్ఎఫ్ సిబ్బంది నిబద్ధత, క్రమశిక్షణ, సమర్థవంతమైన శిక్షణ వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. విపత్తు నిర్వహణలో వారి సామర్థ్యం మరింత బలపడిందని అన్నారు.

పాల్గొన్న ఉన్నతాధికారులు

2024లో సంభవించిన బుడమేరు వరదలలో ఎపిఎస్ ఆర్ఎఫ్ టీమ్స్ చేసిన అత్యున్నత సేవను గుర్తించిన కూటమి ప్రభుత్వం రూ.2కోట్లు బడ్జెట్ని కేటాయించిదన్నారు. ఆ నిధులతో ఆధునిక పరికరాలు కొనుగోలు చేసిందన్నారు. ఈ ఆధునిక పరికరాల సాయంతో ఎపిఎస్ఆర్ఎస్ బృందం ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.. ఈ కార్యక్రమంలో డిజిపి హరీష్ కుమార్ గుప్తాతోపాటు సిఐడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్, పోలీసు నియామక మండలి చైర్మన్ ఆర్కే మీనా, శాంతిభద్రతల విభాగం అదనపు డిజిపి ఎన్. మధుసూదన్ రెడ్డి, నిఘా విభాగాధిపతి మహేష్ చంద్ర లడ్డా, బెటాలియన్ ఐజి బి రాజకుమారి, ఐజీలు సిహెచ్ శ్రీకాంత్, పిహెచ్ డి రామకృష్ణ, రవిప్రకాశ్, ఆకే రవి కృష్ణ, డిఐజిలు సెంథిల్ కుమార్, ఫక్కీరప్ప, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

హిమాచల్ అసెంబ్లీ సంచలన బిల్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha