Arijit Singh: నీట్ (NEET) పరీక్షల్లో జరిగిన అక్రమాలు, లీకేజీలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయకుడు అరిజిత్ సింగ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, పాలకులకు జవాబుదారీతనం ఉండాలని ఆయన హెచ్చరించారు. “హలో నాయకులారా.. మీరేమైనా దేవుళ్లని భావిస్తున్నారా?” అంటూ నిలదీశారు.

సీజేపీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద దీక్షలు
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో నీట్ అక్రమాలకు నిరసనగా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ వ్యవహారానికి పూర్తి బాధ్యత వహిస్తూ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ నేతలు నిరాహార దీక్షలు చేపట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై అరిజిత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Arijit Singh: విద్యార్థుల పక్షాన గొంతు విప్పిన అరిజిత్
యువ నిరసనకారులపై పోలీసులు బలప్రయోగం చేయడాన్ని ఖండిస్తూ అరిజిత్ సింగ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “ఇక్కడ చూస్తేనేమో విద్యార్థులపై లాఠీఛార్జ్ చేస్తున్నారు. నాయకులారా, మంత్రులారా కాస్త వినండి! ఢిల్లీ పోలీసులారా, మీకు కనీస మానవత్వం అనిపించడం లేదా? అక్కడ అసలు ఏం జరుగుతోంది? అధికారంలో ఉన్నంత మాత్రాన మిమ్మల్ని మీరు దేవుళ్లుగా అనుకుంటున్నారా? జనాలు ఈ అన్యాయాన్ని కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. హర్ హర్ మహాదేవ్! అధికారం ఎల్లప్పుడూ ఒకరి వద్దే ఉండదు, మార్పు ఒక్కటే శాశ్వతం” అని ఆయన నొక్కి చెప్పారు.
16 ఏళ్ల తర్వాత ఇండియాకు రానున్న ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ

