Dailyhunt
సీమ హనుమాన్ దేవస్థానంలో ఆధ్యాత్మిక వైభవం: ఘనంగా 'గాథ పూజ' కార్యక్రమం!

సీమ హనుమాన్ దేవస్థానంలో ఆధ్యాత్మిక వైభవం: ఘనంగా 'గాథ పూజ' కార్యక్రమం!

వార్త 1 week ago

Sima Hanuman Temple: సిర్గాపూర్ మండల ప్రాంతంలోని ఉజాలం పాడ్ చాప్టకే సీతారాం తండా గ్రామ పంచముఖి గ్రామ శివారులో వెలిసిన శ్రీ సీమ హనుమాన్ దేవస్థానం తృతీయ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ అఖండ హరినామ సప్త రంగ వైభవంగా ఏడు రోజులు పూర్తి చేసుకొని ఈరోజు గురువర్యుల శ్రీ కరణ్ గజేంద్ర భారతి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీ హరి భక్త పారాయణ్ అవదుత్ మహారాజు గారిచే గాథ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తుకారం మహారాజ్ రాసినటువంటి అభంగాలతో భజన కార్యక్రమం చేస్తూ భక్తులు ఆడుతూ పాడుతూ గాథ పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది.

Read Also: High-Tech Automation.. High-Speed Printing: తెలంగాణలో హెచ్‌సీసీబీ సరికొత్త బెంచ్‌మార్క్

తరలివచ్చిన భక్తజనం

ఈ కార్యక్రమంలో సిర్గాపూర్ మండల ప్రాంతాల్లోని ప్రజలు, నారాయణఖేడ్ నియోజకవర్గం లోని ప్రజలు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆనంద్ మహారాజ్ ఏకంబ అవధూత్ మహారాజ్ జ్ఞానేశ్వర్ మహారాజ్ గారు మరియు శ్రీ సీమా హనుమాన్ దేవస్థానం ధార్మిక ఆధ్యాత్మిక సేవా సదన్ ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా గురువర్యులు హరిభక్త పారాయణ్ శ్రీ కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ గారిచే రేపు ఉదయం 10 గంటలకు కాలా కీర్తన సేవా కార్యక్రమం మహారాజ్ గారిచే నిర్వహించబడుతుందని ట్రస్ట్ సభ్యులు సంజీవులు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ట్రస్ట్ సభ్యులు తెలపడం జరిగింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

హైదరాబాద్‌లో మీ సేవ కేంద్రాలపై ఏసీబీ దాడులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha