Pak PM On Indus Waters : సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) అంశంపై పాకిస్థాన్ (Pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలను రాజేశాయి.
పాకిస్థాన్ నీటి హక్కులను హరించేలా భారత్ ఎలాంటి చర్యలు చేపట్టినా సహించేది లేదని, తమకు దక్కాల్సిన “ప్రతి నీటి బొట్టు ఒక రెడ్ లైన్” అని ఆయన హెచ్చరించారు.
Read Also: Bill Gates : చిక్కుల్లో బిల్ గేట్స్ కూతురు !!

Pak PM On Indus Waters
Pak PM On Indus Waters : సరిహద్దుల్లో ఉగ్రదాడి ఘటనలు
సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై భారత్ కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఉగ్రవాదం, చర్చలు లేదా ఒప్పందాలు కలసి సాగవని (“నీరు, రక్తం కలసి ప్రవహించలేవు”) భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉగ్రదాడి ఘటనల అనంతరం భారత్ ఈ ఒప్పందం కింద జలాల విడుదలపై కఠిన నిర్ణయం తీసుకోవడంతో పాకిస్థాన్‌లో వ్యవసాయం, తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో షెహబాజ్ షరీఫ్ ఈ తరహా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
'ట్రూత్ సోషల్' పిటిషన్: ట్రంప్‌పై ఫెడరల్ కోర్టులో కేసు దాఖలు

