Indus Water : సింధూ నదీ జలాల పంపిణీ విషయంలో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారానికి ఐక్యరాజ్యసమితి (UN) సాక్షిగా భారతదేశం అత్యంత ఘాటుగా సమాధానమిచ్చింది.
జెనీవాలో జరుగుతున్న యూఎన్‌హెచ్ఆర్‌సీ (UNHRC) 62వ సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి అనుపమ సింగ్ ఈ ఉదంతంపై దేశ వైఖరిని స్పష్టం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందానికి (Indus Water Treaty) పూర్తిగా కాలం చెల్లిందని, ఆనాటి నిబంధనలు నేటి మారుతున్న భౌగోళిక, పర్యావరణ పరిస్థితులకు ఏమాత్రం సరిపోవని ఆమె తేల్చి చెప్పారు. దశాబ్దాల క్రితంనాటి పాత చట్టాలను పట్టుకుని వేలాడటం వదిలేసి, ప్రస్తుత వాస్తవ పరిస్థితులను గ్రహించాలని పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ప్రతినిధుల ముందే గట్టిగా చురకలంటించారు.
Read Also : ఇండియా లో తీవ్ర కరవు ఏర్పడబోతుందా..? ఆందోళన కలిగిస్తున్న IMD నిపుణుల హెచ్చరిక

ఉగ్రవాదం మరియు సద్భావన కలిసి సాగవు.. పాక్‌కు గట్టి వార్నింగ్!
పాకిస్తాన్ ప్రభుత్వం ఒకవైపు భారత్‌పైకి సరిహద్దుల గుండా ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రోత్సహిస్తూ, మరోవైపు అంతర్జాతీయ ఒప్పందాల పేరిట భారత్ నుండి స్నేహాన్ని, సద్భావనను ఆశించడం ముమ్మాటికీ అసాధ్యమని అనుపమ సింగ్ స్పష్టం చేశారు. “రక్తపాతం, ఉగ్రవాద చర్యలకు పాల్పడే ఏ దేశమైనా పొరుగు దేశం నుండి సద్భావన వల్ల కలిగే ప్రయోజనాలను ఆశించలేదు” అంటూ భారత్ తరఫున ఒక బలమైన సందేశాన్ని పాక్‌కు పంపారు. కశ్మీర్ అంశాన్ని లేదా జలాల వివాదాన్ని అనవసరంగా అంతర్జాతీయ వేదికలపైకి తెచ్చి నాటకాలు ఆడటం మానేసి, మొదట పాకిస్తాన్ తన దేశంలో ఉన్న అంతర్గత సంక్షోభాలు మరియు సొంత వ్యవహారాలను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని వీడనంత కాలం భారత్ నుండి ఎటువంటి రాయితీలు ఉండబోవనే సంకేతాన్ని ఈ వ్యాఖ్యల ద్వారా భారత్ మరోసారి ప్రపంచానికి స్పష్టం చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

