Dailyhunt
సింగపూర్ లో మంత్రుల బృందం

సింగపూర్ లో మంత్రుల బృందం

వార్త 1 week ago

పాలనా విధానాలు, పట్టణాభివృద్ధి నమూనాల పరిశీలనకు వెళ్లిన మంత్రులు

AP Ministers Singapore Visit: ఆధునిక పరిపాలనా విధానాలు, పట్టణ అభివృద్ధి నమూనాలు, సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలపై శిక్షణ అందించడానికి సింగపూర్ ప్రభుత్వం అంగీకారంపై ఏపీ మంత్రులు ఆ దేశానికి వెళ్ళారు.

మంగళవారం నుంచి ఈ నెల 27 వరకు మంత్రుల బృందం సిం గపూర్లో పర్యటించనుంది. పరిపాలన, లా అండ్ ఆర్డర్, రోడ్లు, పర్యాటక రంగాలను పరిశీలిం చనుంది. ఈ రోజు మొదటి రోజు అయినందున సింగపూర్లో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రుల బృందం ఆ దేశ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్ తో భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో రాష్ట్రమంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్ తో పాటు భారత హై కమిషనర్ పాల్గొన్నారు. అత్యంత సానుకూల వాతావరణంలో ఈ సమావేశం ముగియగా, భవిష్యత్తులో భారతదేశం సింగపూర్ మధ్య సంబంధాలు మరింత దృఢంగా ఎదుగుతాయని ఇరు దేశాల నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తుందని, సింగపూర్తో సమగ్ర సహకారానికి దారి తీస్తుందని రాష్ట్ర మంత్రులు భావిస్తున్నారు.

 AP ministerial team in Singapore

AP Ministers Singapore Visit: దౌత్య సంబంధాలు, ఆర్థిక భాగస్వామ్యం

లా అండ్ ఆర్డర్, రోడ్లు, పర్యాటక రంగాలను పరిశీలించనుంది. అయితే ఈ రోజు మొదటి రోజు అయినందున సింగపూర్లో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రుల బృందం ఆ దేశ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్తో భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్ పాటు భారత హై కమిషనర్ పాల్గొన్నారు. భారతదేశం సింగపూర్ మధ్య ఉన్న చిరకాల స్నేహ సంబంధాలు, ఆర్థిక భాగస్వామ్యం, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరు దేశాల నాయకులు చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల విస్తరణతో పాటు, మోలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధన రంగాలలో సహకారాన్ని పెంపొందించడంపై చర్చలు ప్రధానంగా కేంద్రీకృతమయ్యాయి. అలానే రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు, మోలిక వసతులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో సహకారంపై చర్చించారు.

సాంకేతిక రంగాలలో భాగస్వామ్యం

స్మార్ట్ సిటీలు, పట్టణ ప్రణాళిక వ్యర్థాల నిర్వహణలో సింగపూర్కు ఉన్న నైపుణ్యాన్ని వినియోగించుకోవడం, నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య, శిక్షణా కార్యక్రమాలు, అలాగే ఫిన్స్టక్ (ఫిన్స్టిక్) కృత్రిమ మేధన్సు (ఎఐ) వంటి సాంకేతిక రంగాలలో భాగస్వామ్యాలు వంటి వివిధ అంశాలపై విస్తృతమైన చర్చలు జరిగాయి. రానున్న రోజుల్లో సంబంధాలు మరింత బలోపేతం ఆధునిక పరిపాలనా విధానాలు, పట్టణ అభివృద్ధి నమూనాలు, సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలపై శిక్షణ అందించడానికి సింగపూర్ ప్రభుత్వం అంగీకరించింది. అత్యంత సానుకూల వాతావరణంలో ఈ సమావేశం ముగియగా, భవిష్యత్తులో భారతదేశం సింగపూర్ మధ్య సంబంధాలు మరింత దృఢంగా ఎదుగుతాయని ఇరు దేశాల నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తుందని, సింగపూర్తో సమగ్ర సహకారానికి దారి తీస్తుందని రాష్ట్ర మంత్రులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

నీతి ఆయోగ్ 'దివ్య భారత్' నివేదికలో రాష్ట్ర టూరిజానికి అగ్రతాంబూలం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha