Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కొక్కరికి రూ.1.51 లక్షల బోనస్‌

సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కొక్కరికి రూ.1.51 లక్షల బోనస్‌

వార్త 1 week ago

Singareni Dasara Bonus: తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా శుభవార్త ప్రకటించింది. సంస్థ ఆర్జించిన లాభాల్లో కార్మికులకు వాటా కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

మొత్తం రూ.1,754 కోట్ల లాభాల్లో 34 శాతం వాటాను కార్మికులకు బోనస్‌గా అందించనున్నట్లు తెలిపారు.

Read Also :LB Nagar corridor: ఎల్బీనగర్ హయత్‌నగర్ ఫ్లైఓవర్‌కి గ్రీన్ సిగ్నల్

ఒక్కో కార్మికుడికి రూ.1,51,912

ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ ప్రకారం ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.1,51,912 అందనుంది. అలాగే కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 చొప్పున చెల్లించనున్నారు. దసరా పండుగ వేళ ఈ బోనస్‌ కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా ఊరటనివ్వనుంది.

Singareni Dasara Bonus: కార్మికుల సమస్యల పరిష్కారంపైనా దృష్టి

బోనస్‌తో పాటు కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపైనా ప్రభుత్వం దృష్టి సారించనుంది. కరోనా సమయంలో విధులకు హాజరుకాని కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలించనున్నారు. కార్మికుల కోసం హౌసింగ్‌ కాలనీల నిర్మాణం చేపట్టడం, మారు పేర్ల సమస్యను పరిష్కరించడం వంటి అంశాలపైనా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిపివేత ప్రచారంపై జలమండలి స్పష్టత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha