Justice P Sam Koshy: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా (Acting Chief Justice) హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పి. సామ్ కోషి నియమితులయ్యారు.
హైకోర్టులో అత్యంత సీనియర్ జడ్జిగా సేవలందిస్తున్న ఆయనకు, ఉన్నతస్థానానికి సంబంధించిన తాత్కాలిక బాధ్యతలను అప్పగిస్తూ తగిన ఉత్తర్వులు వెలువడ్డాయి.
సుప్రీంకోర్టుకు జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పదోన్నతి
ఇంతకుముందు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్లడంతో ఏర్పడిన ఖాళీ నేపథ్యంలో, తదుపరి ఏర్పాట్లు జరిగే వరకు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ సామ్ కోషి విధులను నిర్వర్తించనున్నారు.

