Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింగరేణిలో కార్మిక కుటుంబాలకు బీమా రక్షణ

సింగరేణిలో కార్మిక కుటుంబాలకు బీమా రక్షణ

వార్త 1 week ago

Singareni Accident Insurance Scheme: రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సింగరేణిలో ప్రవేశపెట్టిన ఉచిత ప్రమాద బీమా పథకం మరణించిన కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది.

చనిపోయిన కార్మికుని లేని లోటు తీర్చలేకపోయినా, అతనిపై ఆధార పడిన కుటుంబాన్ని మాత్రం ఆర్థికంగా ఆదుకుంటోంది. ఈ విధంగా ఈ బీమా పధకం ద్వారా ఇప్పటి వరకూ 40 మందికి పైగా కుటుం బాలకు ఆర్థిక భరోసాను కల్పించినట్లు సింగరేణి సిఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి తెలిపారు.

Read Also: Aadhaar Update: కొత్త ఆధార్ యాప్.. మీ డిజిటల్ గుర్తింపు ఇక మరింత సురక్షితం

Singareni Accident Insurance Scheme: దేశంలోనే రూ.1.25 కోట్ల వరకు ప్రమాద బీమా

ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో దేశంలో తొలిసారిగా రూ.1.25 కోట్ల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని సింగరేణి అమలు చేసింది. 2024లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా బీమా రంగంలో ఒక మారింది. బొగ్గు కంపెనీలతో పాటు, ఇతర సంస్థలు కూడా ఈ ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయడానికి సింగరేణి సంస్థ స్ఫూర్తిగా నిలిచింది. సింగరేణి ఉద్యోగులు తమ శాలరీ ఖాతాలు కలిగి ఉన్న పలు బ్యాంకుల వారు ఈ ప్రమాద బీమా పథకాన్ని అమలవుతోంది.

వివిధ బ్యాంకుల ఒప్పందాలు

పిఐబి, బిఒబి, ఐఒబి (బ్యాంకులు) ప్రమాద బీమా పథకం కింద రూ.1.25 కోట్లను చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నాయి.
ఎక్కువ మంది కార్మికులు శాలరీ ఖాతాలు కలిగి ఉన్న ఎస్బీఐ, యుబిఐ, కెనరా బ్యాంకులు రూ. కోటి ప్రమాద బీమా చెల్లింపు జరుపుతున్నాయి. ఈ విధంగా బీమా పథకం మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.1 కోటి నుండి రూ.1.25 కోట్ల వరకు అందజేయడంతో వాటికి ఆర్థికంగా ఊరట లభిస్తుంది. ఈ బీమా పథకం కింద రెండేళ్లలో ఉద్యోగుల విప్లవాత్మక చర్యగా మృతి చెందిన 32 మంది కుటుంబాలకు సుమారు రూ.28 కోట్లను ఎస్బీఐ, యుబిఐ 13 మందికి సుమారు రూ.13 కోట్ల చెల్లించింది. ప్రమాదంలో మృతి చెందిన వారికే కాకుండా కాళ్లు, చేతులు, ఇతర అవయవాలు ప్రమాదానికి గురై పాక్షిక, శాశ్వత అంగ వైకల్యం చెందినప్పటికీ ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నారు.

పదవీ విరమణ పొందిన వారికీ ఉచిత బీమా

అలాగే సింగరేణిలో దాదాపు 30 వేల మంది పొరుగు సేవల సిబ్బంది సంక్షేమం విషయంలోనూ దృష్టి సారించింది. వీరి కుటుంబాలకు కూడా బీమా ద్వారా భద్రత కల్పించేందుకు రూ.40 లక్షల ప్రమాద బీమా అమలవుతోంది. ఇక సంస్థలో పదవీ విరమణ పొందిన వారికి కూడా ఈ ఉచిత ప్రమాద బీమాను కొనసాగించేలా చూడాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యాజమాన్యంతో సంప్రదింపులు జరిగింది. దీంతో చాలా బ్యాంకులు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ పింఛన్ ను తమ బ్యాంక్ ద్వారా పొందిన పక్షంలో రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉచిత బీమా వర్తింపజేయడానికి బ్యాంకులు అంగీకరించినట్లు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,698.96 కోట్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha