Singur Project: సంగారెడ్డి జిల్లాలోని కీలకమైన సింగూర్ ప్రాజెక్ట్‌లో మౌలిక వసతుల మెరుగుదలకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్ట్ నిర్వహణలో అత్యంత ప్రధానమైన ఆర్‌సి (RC) గేట్లు, హోయిస్ట్ పరికరాలు, స్టాప్ లాగ్ ఎలిమెంట్స్ మరియు గ్యాంట్రీ క్రేన్‌లకు పెయింటింగ్, మరమ్మతులు మరియు నిర్వహణ పనుల కోసం ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
Read Also:Tourism : తెలంగాణ పర్యాటక రంగానికి అరుదైన గుర్తింపు
రూ. 8.14 కోట్లతో ప్రాజెక్ట్ పునరుద్ధరణ
ఈ పనుల నిమిత్తం మొత్తం రూ. 8.14 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం కేటాయించింది. ప్రాజెక్ట్ గేట్ల నిర్వహణ సరిగ్గా ఉంటేనే వర్షాకాలంలో వరద నీటిని నియంత్రించడం, అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయడం సులభతరం అవుతుంది. ఈ నిధులతో చేపట్టే పనుల వల్ల ప్రాజెక్ట్ యొక్క ఆయుష్షు పెరగడమే కాకుండా, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అడ్డుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ అభివృద్ధి చర్యల ద్వారా ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం, సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఫలితంగా ఆయకట్టు రైతులకు సకాలంలో, సమర్థవంతంగా సాగునీరు అందేలా మార్గం సుగమం అవుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.
Singur Project Developmentదామోదర్ రాజానరసింహ చొరవతో అభివృద్ధి దిశగా అడుగులు
తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి దామోదర్ రాజానరసింహ గారి నాయకత్వంలో ఈ అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయి. జిల్లా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, సాగునీటి ప్రాజెక్టుల బలోపేతానికి ప్రభుత్వం దృఢమైన అడుగులు వేస్తోందని ఈ నిధుల మంజూరు మరోసారి నిరూపించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

