Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింగూరు ప్రాజెక్టులో దూకి వ్యక్తి ఆత్మహత్య

సింగూరు ప్రాజెక్టులో దూకి వ్యక్తి ఆత్మహత్య

వార్త 1 month ago

Singur Project Suicide: సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పుల్కల్ ఎస్ఐ నల్లా విశ్వజన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్లోని నిజాంపేట ప్రాంతానికి చెందిన బండారిపల్లి శ్రీనివాసరావు (61) ఫుట్వేర్ దుకాణంలో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు.ప్రతీ రోజు మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చి వెళ్లే వాడు. అయితే, ఈ నెల 28వ తేదీన 11.30 గం టలకు తన ఫోన్ దుకాణంలోనే పెట్టి బయటకు వెళ్లిపోయాడు. శ్రీనివాసరావు కనిపించడం లేదంటూ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా, మ్యాన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేశారు.

Read Also:Sampath kumar case : తప్పుడు ప్రచారం ఆరోపణలతో కోర్టుకు వెళ్లిన నేత

Singur Project Suicide: ఆత్మహత్యకు కారణం

కేపీహెచ్బీ పోలీసులు దర్యాప్తు చేయగా, సింగూరు ప్రాజెక్టు వైపునకు వెళ్లినట్లు గుర్తించారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు మృతుడి కుమారుడు బండారిపల్లి సంపత్, స్నేహితులు గరిమెళ్ల శ్రీకాంత్, కడియాల సత్యనారాయణ, కేవీవీ అప్పరావులు ప్రాజెక్టు వద్దకు వచ్చి గాలించారు.

 Singur Project Suicide Case

ప్రాజెక్టు నిల్వ నీటిలో బోర్ల పడి ఉన్న మృతదేహన్ని పరిశీలించగా, బండారిపల్లి శ్రీనివాసరావుగా గుర్తించారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేక పోవడం, అప్పుల బాధ అధికమవడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుమారుడు బండారిపల్లి సంపత్ పోలీసులకు పిర్యాదు చేశారు. సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మృతదేహనికి పోస్టుమార్థం నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు: నారాయణఖేడ్ ఎమ్మెల్యే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha