Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింహాచలం హుండీ ఆదాయం రూ.2.11 కోట్లు

సింహాచలం హుండీ ఆదాయం రూ.2.11 కోట్లు

వార్త 3 weeks ago

Simhachalam appanna:విశాఖపట్నం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న ఆలయానికి భక్తుల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. శ్రీ వరాహలక్ష్మీనరసింహ స్వామివారి హుండీల లెక్కింపు పూర్తి కాగా కేవలం ఇరవై ఒక రోజుల్లోనే రెండు కోట్ల పదకొండు లక్షల రూపాయలు సమకూరాయి.

తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం విశేషం.

Read also: Nara Lokesh Bellary Visit: బళ్లారి పర్యటన.. సుజ్లాన్ యార్డును సందర్శించనున్న మంత్రి లోకేశ్

 Temple receives Rs 2.11 crore in Hundi income.

ఇరవై ఒక రోజుల్లోనే రెండు కోట్ల ఆదాయం

భక్తులు తమ మొక్కులను చెల్లించుకోవడంతో ఆలయ హుండీ ఆదాయం భారీగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు స్వామివారికి కానుకలను సమర్పిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలో జరిగిన హుండీల లెక్కింపు ద్వారా ఈ మొత్తం వెల్లడైంది. నిత్యం భక్తుల రద్దడి కొనసాగుతుండటంతో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.

Simhachalam appanna:భక్తుల రద్దీతో పెరుగుతున్న ఆదాయం

సింహాచలం క్షేత్రానికి రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం తగిన ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు సమర్పిస్తున్న కానుకలతో ఆలయాభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని అధికారులు తెలిపారు.

Epaper: epaper.vaartha.com

అమరావతికి రూ. 1200 కోట్ల కేటాయింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha