Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింహాచలంలో అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు

సింహాచలంలో అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు

వార్త 1 month ago

Chandrababu Naidu Simhachalam Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.

ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి, భక్తుల నమ్మకమైన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు.

Read Also : TTD Updates: శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. ఇక భోజన కష్టాలుండవు!

 CM Chandrababu Naidu visited the Simhachalam Varaha Lakshmi Narasimha Swamy temple

Chandrababu Naidu Simhachalam Visit: కేంద్ర, రాష్ట్ర మంత్రుల హాజరు

దర్శనం అనంతరం రంగమండపంలో వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను, శేష వస్త్రాన్ని ఆయనకు బహూకరించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

ముఖ్యమంత్రితో పాటు ఈ ఆధ్యాత్మిక పర్యటనలో భారీగా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, గణబాబు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం ఈ పర్యటన చేపట్టారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నా నారా భువనేశ్వరి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha