Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నా నారా భువనేశ్వరి

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నా నారా భువనేశ్వరి

వార్త 1 month ago

Nara Bhuvaneswari Yadadri Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధర్మపత్ని నారా భువనేశ్వరి మంగళవారం తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రిని సందర్శించారు.

కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆమెకు యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో ఆమెను లోపలికి ఆహ్వానించారు.

Read Also : AP Green Energy Corridor: ఏపీలో రూ.21,500 కోట్లతో జిఇసి అభివృద్ధి

 Special prayers of Nara Bhuvaneshwari in Yadadri: Darshan of the Lord with family members!

Nara Bhuvaneswari Yadadri Visit: స్వయంభూ లక్ష్మీనరసింహుడి దర్శనం

నారా భువనేశ్వరి యాదాద్రి గర్భాలయంలో వెలిసిన స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రంగమండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను, శేష వస్త్రాన్ని ఆమెకు బహూకరించి గౌరవించారు.

భక్తుల రద్దీ.. పోలీసుల భద్రత

ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా యాదాద్రిలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో భువనేశ్వరి పర్యటన సందర్భంగా సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దర్శనం ముగించుకున్న అనంతరం ఆమె కొద్దిసేపు ఆలయ పరిసరాలను పరిశీలించి, అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఏపీలో తగ్గిన పెట్రోల్ కష్టాలు.. ఊపిరి పీల్చుకున్న వాహనదారులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha