Mirzapur Movie Trailer: ఓటీటీ వేదికగా దేశవ్యాప్తంగా అపూర్వ ఆదరణ పొందిన 'మిర్జాపూర్' ఇప్పుడు వెండితెరపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న క్రైమ్ డ్రామా సిరీస్ అమెజాన్ ఎమ్‌జీఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మాతలు రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ సంయుక్తంగా ‘మిర్జాపూర్: ది మూవీ’ని నిర్మిస్తున్నారు. గుర్‌మీత్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 04న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుండగా, మేకర్స్ తాజాగా అధికారిక ట్రైలర్‌ను విడుదల చేశారు.
Read Also : Mega 158 Movie: తన 158వ సినిమా టైటిల్‌ను లీక్ చేసిన చిరంజీవి

Mirzapur Movie Trailer: పవర్‌ఫుల్ డైలాగ్స్, ‘మున్నా భయ్యా’ సర్ప్రైజ్ రీఎంట్రీ
సింహాసనం అనేది రాజకీయాల ద్వారా రాదు, అలా అని వంశపారంపర్యంగానూ రాదు… కేవలం బాహుబలం ఉంటేనే సింహాసనం దక్కుతుంది” అనే అత్యంత శక్తివంతమైన డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ ప్రేక్షకులలో పూనకాలు తెప్పిస్తోంది. ఓటీటీలో అలరించిన ఈ కథను వెండితెర స్థాయికి తగ్గట్టుగా భారీ నిర్మాణ విలువలతో, అత్యున్నత యాక్షన్ సన్నివేశాలతో మలిచారు. గతంలో సిరీస్‌లో మరణించినట్లు చూపించిన ఫేవరెట్ క్యారెక్టర్ ‘మున్నా భయ్యా’ (దివ్యేందు) పాత్రను ఈ సినిమాలో మళ్లీ రీఎంట్రీ చేయించడం అభిమానులకు అసలైన విందుగా మారింది.
మిర్జాపూర్ కుర్చీ (సింహాసనం) దక్కించుకోవడమే లక్ష్యంగా కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డూ పండిట్ (అలీ ఫజల్) మరియు మున్నా భయ్యాల మధ్య జరిగే రక్తపాతంతో కూడిన పోరాటం ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో ప్రధాన తారలతో పాటు శ్వేతా త్రిపాఠి, రసికా దుగ్గల్, అభిషేక్ బెనర్జీ, జితేంద్ర కుమార్, రవి కిషన్ తదితర భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. బిగ్ స్క్రీన్‌పై మిర్జాపూర్ చేసే హంగామా బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాయడం ఖాయంగా కనిపిస్తోంది.

