Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సినిమా స్టైల్​లో ప్రపోజ్​- ఎండ్​ కార్డ్ మాత్రం పోలీస్​ స్టేషన్​లో!

సినిమా స్టైల్​లో ప్రపోజ్​- ఎండ్​ కార్డ్ మాత్రం పోలీస్​ స్టేషన్​లో!

వార్త 1 day ago

Empire State Building Proposal : ప్రేమలో ఉన్నవాళ్లు ఆకాశమే హద్దంటారు. కానీ ఈ జంట మాత్రం ఆ మాటను అక్షరాలా నిజం చేసింది. తమ జీవితంలో నిశ్చితార్థం చేసుకునే క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలని భావించిన ఆ జంట..

ఏకంగా భద్రతా వ్యవస్థ కళ్లు గప్పి 1,454 అడుగుల ఎత్తైన ప్రపంచ ప్రసిద్ధ భవనం పైకి ఎక్కింది. అక్కడ ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకుంది. అయితే, నిబంధనలను ఉల్లంఘించి చేసిన ఈ సాహసం చివరకు వారిని జైలు పాలు చేసింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న అత్యంత ప్రసిద్ధ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వేదికగా బుధవారం మధ్యాహ్నం ఈ హైడ్రామా జరిగింది. రష్యాకు చెందిన ఇవాన్ (ఇవాన్ బీర్కస్), ఏంజెలా నికోలవ్ అనే జంట నల్లటి దుస్తులు, ముఖాలకు మాస్కులు ధరించి ఎలాంటి భద్రతా తాళ్లు (రోప్స్) లేకుండానే సుమారు 1,454 అడుగుల (443 మీటర్లు) ఎత్తులో ఉన్న భవన యాంటెన్నాపైకి చేరుకుంది. అంతటి ఎత్తులో సన్నని భాగంపై నిలబడి ముద్దు పెట్టుకోవడమే కాకుండా.. ‘అధికార దాహాన్ని ప్రేమకున్న शक्ति అధిగమించినప్పుడు ప్రపంచానికి శాంతి లభిస్తుంది’ అని రాసి ఉన్న ఒక నల్లటి బ్యానర్‌ను ప్రదర్శించారు.

Read Also: Trump's Birthright Plan B: గర్భవతులకు అమెరికాలో చోటు లేదా? కోర్టులో ఎదురుదెబ్బ తర్వాత ట్రంప్ 'ప్లాన్ బి'

Empire State Building Proposal : మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్.. సోషల్ మీడియాలో వైరల్

ఆ తర్వాత యాంటెన్నాలోని మరో భాగంలోకి దిగి, ఇవాన్ మోకాళ్లపై కూర్చుని ఏంజెలాకు సినిమా స్టైల్‌లో ప్రపోజ్ చేశాడు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరూ ఆలింగనం చేసుకుని సెల్ఫీలు తీసుకున్నారు. యువతి తన సోషల్ మీడియా ఖాతాలో నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ పెట్టిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీసుల అత్యవసర సేవల విభాగం (NYPD) సిబ్బంది వెంటనే యాంటెన్నాపైకి చేరుకుని వారిని కిందకు దించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే సమయంలో ‘మీరు ఇక్కడ ఉండకూడదు’ అని హెచ్చరించగా.. ‘మాకు నిశ్చితార్థం జరిగింది’ అని ఆ జంట సమాధానమిచ్చింది. భవనంలోకి అక్రమంగా ప్రవేశించడం, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం, ఆస్తి ధ్వంసం, భద్రతా వ్యవస్థలో జోక్యం చేసుకోవడం వంటి తీవ్రమైన అభియోగాల కింద పోలీసులు వీరిపై కేసులు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తమ నుంచి ఎలాంటి అనుమతి లేదని భవన యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం న్యూజెర్సీలో నివసిస్తున్న ఈ జంటకు ఇలాంటి సాహసాలు కొత్తేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎత్తైన భవనాలు, వంతెనలు, టవర్లపైకి ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా ఎక్కి వీరు గతంలోనూ వార్తల్లో నిలిచారు.

read also:

అమెజాన్ ప్రైమ్‌కు షాక్: ఫెడరల్ కోర్టులో దావా వేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha