Movie Tickets : తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల నిర్వహణ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ (Movie Tickets) మేరకు సినిమా థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరల సవరణతో పాటు ప్రత్యేక మార్గదర్శకాలను జూలు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది.
కొత్త టికెట్ ధరల వివరాలు :
థియేటర్ల స్థాయిని బట్టి ప్రభుత్వం కనిష్ట మరియు గరిష్ట ధరలను ఖరారు చేసింది. నాన్-ఏసీ థియేటర్లు, నాన్-ప్రీమియం సీట్లకు రూ. 30 – 70, ప్రీమియం సీట్లకు రూ. 50 – 100. ఏసీ థియేటర్లు, నాన్-ప్రీమియం రూ. 50 – 150, ప్రీమియం సీట్లకు రూ. 100 – 200. స్పెషల్ థియేటర్లు (2K/4K స్క్రీన్లు, 7.1 సౌండ్ సిస్టమ్) నాన్-ప్రీమియం రూ. 100 – 250, రిక్లైనర్ ప్రీమియం సీట్లకు రూ. 200 – 300. మల్టీప్లెక్స్‌లు రెగ్యులర్ సీట్లు రూ. 100 – 250, రిక్లైనర్ సీట్లు రూ. 200 – 300గా నిర్ణయించారు.

రూ. 100 కోట్లకు పైగా నిర్మాణ వ్యయం ఉన్న చిత్రాలను ‘సూపర్ హై బడ్జెట్’ సినిమాలుగా గుర్తించి వాటికి ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. ఇలాంటి సినిమాలు విడుదలైన మొదటి 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే, ఈ పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో దాదాపు 20 శాతాన్ని లేదా గరిష్టంగా రూ. 1 కోటి వరకు విరాళాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC) ఆధ్వర్యంలోని సినీ కార్మికుల సంక్షేమ నిధికి తప్పనిసరిగా చెల్లించాలనే నిబంధనను తీసుకువచ్చారు.
రాష్ట్రంలోని థియేటర్లలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు రోజుకు 5 షోలకు అనుమతినిచ్చారు. ప్రతి థియేటర్‌లో తప్పనిసరిగా 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కింద ఉంచాలని, అలాగే చిన్న సినిమాలకు ప్రతీ రోజు కనీసం ఒక షో కేటాయించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ప్రభుత్వ ఈ నిర్ణయం వల్ల భారీ చిత్రాల నిర్మాతలకు ఊరట లభించడంతో పాటు, తెరవెనుక పనిచేసే సినీ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూరుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2పై వివాదం.. సామాన్యుల అవమానంపై నెటిజన్ల ఫైర్

