Mumbai Crime: మహారాష్ట్రలోని ముంబై సమీపంలో ఉన్న అంబర్‌నాథ్‌లో ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది. వివాహమై కేవలం 48 రోజులు కూడా గడవకముందే విశాఖ తిల్కర్ (26) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు పెట్టిన శారీరక, మానసిక వేధింపులే ఈమె మృతికి కారణమని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Read also: USCIS's tough decision: గ్రీన్ కార్డ్ ఆశలపై యూఎస్‌సీఐఎస్ నీళ్లు
Harassment via installed CCTV cameras… Married woman commits suicide just 48 days after the wedding!
Mumbai Crime: ఇల్లంతా కెమెరాలు.. పక్కింటి ఆవిడతో మాట్లాడిందని దారుణంగా కొట్టి!
బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖకు నితిన్ తిల్కర్ అనే డాక్టర్ తో ఈ ఏడాది ఏప్రిల్ 30న ఘనంగా వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కొన్ని రోజులకే భర్త, అత్తమామలు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. పెళ్లిలో ఇచ్చిన కానుకలు సరిపోలేదని, పుట్టింటి నుంచి మరికొంత డబ్బు, బంగారు ఆభరణాలు తీసుకురావాలని విశాఖను వేధించడం ప్రారంభించారు. ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ.. ఎవరితో మాట్లాడుతుందో కనిపెట్టడానికి బెడ్‌రూమ్ మినహా ఇల్లంతా నిఘా కెమెరాలు (CCTV) అమర్చారు. చివరకు మరణానికి రెండు రోజుల ముందు, పక్కింటి మహిళతో మాట్లాడిందనే చిన్న నెపంతో భర్త ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు.
తల్లిదండ్రులు వచ్చేలోపే విషాదం.. డాక్టర్ భర్త అరెస్ట్
తనపై జరుగుతున్న దారుణ వేధింపుల గురించి విశాఖ ఫోన్ చేసి తల్లికి చెప్పుకుని కన్నీరు పెట్టుకుంది. దీంతో తీవ్రంగా ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమెను తమ ఇంటికి తీసుకువెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటుండగానే, ఈలోపే విశాఖ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న శివాజీనగర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాధితురాలిని ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గానూ భర్త నితిన్ తిల్కర్, అత్త ఛాయా తిల్కర్, మరిది నినాద్ తిల్కర్‌లపై కేసు నమోదు చేశారు. నిందితుడైన డాక్టర్ నితిన్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న అత్త, మరిది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
కొత్త ఉద్యోగులకు మోదీ సర్కార్ బంపర్ ఆఫర్: రూ.15 వేల ఆర్థిక సాయం

